మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు తమ మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో పాటు మూడు పార్టీల నేతలు , కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..అతి త్వరలో రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని పేర్కొన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని విమర్శించారు. దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స్ రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని ఆరోపించారు.
ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా..సభలో కొందరు యువకులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అభిమానులు లైట్ పోల్స్ పైకి ఎక్కడంతో పవన్ ప్రసంగాన్ని ఆపిన మోదీ.. దిగాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘మాకోసం వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాణాలు చాలా విలువైనవి.’ అంటూ విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినకపోవడంతో వారిని కిందకు దించాలంటూ పోలీసులకు సూచించారు. దీంతో లైట్ పోల్స్ ఎక్కినా వారంతా కిందకు దిగారు.
Read Also : PM Modi Arrives Boppudi : ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు