జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు (Jana Sena Formation Day) ఈసారి మరింత గ్రాండ్‌గా జరగుతున్నాయి. పార్టీకి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram ) నియోజకవర్గంలోని చిత్రాడ(Chitrada )లో ఆవిర్భావ సభ జరుగుతుంది. ఇది పార్టీకి గర్వించదగిన వేడుక మాత్రమే కాకుండా, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు దిశానిర్దేశం చేసే వేదికగానూ మారనుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సభలో చేసే ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. తన అభిమానులు, పార్టీ క్యాడర్‌తో పాటు రాష్ట్ర ప్రజలకు కీలక సందేశం ఇచ్చే అవకాశముంది.
Harry Brook: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌కు షాక్.. రెండేళ్ల నిషేధం!
ఈ ప్లీనరీలో పవన్ కల్యాణ్ తన రాజకీయ దిశను స్పష్టంగా తెలియజేస్తారని భావిస్తున్నారు. టీడీపీతో కుదిరిన పొత్తు, సీఎం పదవిపై తన స్థానం, భవిష్యత్తులో జనసేన రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తాను ఇంకా దశాబ్దం పాటు చంద్రబాబునాయుడినే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఆయన స్పీచ్(Pawan Kalyan Speech)లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే సూచనలు ఉన్నాయి. బీజేపీతో జనసేన సంబంధాలు, హిందుత్వ ఎజెండా, కూటమి లోపల తలెత్తుతున్న చిన్న చిన్న విభేదాల గురించి కూడా పవన్ మాట్లాడతారా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఇదే వేదికగా పవన్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ వివాదాస్పద అంశాలు కాకినాడ పోర్ట్ వ్యవహారం, బియ్యం స్కాం, వివేకా హత్య కేసు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ తన పార్టీ సాధించిన విజయాలను హైలైట్ చేసే అవకాశం ఉంది. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏ మార్పులు తీసుకువచ్చిందో వివరించడంతో పాటు, తన సోదరుడు నాగబాబును త్వరలో మంత్రి వర్గంలోకి తీసుకునే అంశం గురించిన స్పష్టతనూ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జనసేనలో కొత్త చేరికలు, పార్టీ విస్తరణపై కీలక ప్రకటనలు చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి.
POCSO Case : యడియూరప్పకు స్వల్ప ఊరట
పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాదు, సినీ రంగంలో తన ప్రస్థానం గురించి కూడా ఓ క్లారిటీ ఇస్తారా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలకు కమిట్ అయ్యారు.‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆయన ఈ సినిమాల విడుదల తేదీల గురించి, భవిష్యత్‌లో తాను పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారా? లేక సినిమాలను కొనసాగిస్తారా?6 అనే అంశంపై ప్లీనరీలో ప్రకటన చేసే అవకాశముంది. మొత్తంగా పవన్ కల్యాణ్ ప్రసంగం జనసేన భవిష్యత్తు దిశను నిర్ణయించే ఒక కీలక మలుపుగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.