Pawan Powerful Punch : జగన్ ‘కార్పొరేటర్’ కామెంట్స్‌కు పవన్ మాములు పంచ్ ఇవ్వలేదు

Pawan Powerful Punch : "పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి అయ్యుండాలా? బాబాయిని చంపించి ఉండాలా?" అంటూ ధీటుగా సమాధానమిచ్చారు

Published By: HashtagU Telugu Desk
Pawan Punch

Pawan Punch

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ (Janasena Formation Day)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనదైన శైలిలో పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం, జగన్ (Jagan) లనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల జగన్ చేసిన “పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ” వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. “పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి అయ్యుండాలా? బాబాయిని చంపించి ఉండాలా?” అంటూ ధీటుగా సమాధానమిచ్చారు పవన్. రాజకీయాల్లో సిద్ధాంతాలు ముఖ్యమని, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, మర్డర్లు చేయించడం, కులాలు రెచ్చగొట్టడం వంటి కార్యకలాపాలకు తన పార్టీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు.

TG Assembly : జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి – స్పీకర్ కు బిఆర్ఎస్ వినతి
తాను ప్రజల సమస్యలను ఎదుర్కొనేందుకు, సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చినవాడినని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓట్లు గెలవడం మాత్రమే తన లక్ష్యం కాదని, ప్రజల కోసం పోరాడే దృఢ సంకల్పం తనకు ఉందన్నారు. జనసేన పార్టీ రిజిస్ట్రార్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా ఎదిగిన సంగతి గుర్తుచేశారు. రాజకీయ ప్రస్థానం తనకు ఎంతో మంది విమర్శలతో కూడుకున్నదని, అనేక తిట్లను తిన్నానని, కానీ ఆ విమర్శలే తనను మరింత బలపరచాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో తన ప్రయాణం చాలా కష్టసాధ్యమైందని, తాను మార్క్షల్ ఆర్ట్స్‌లో మూడు గ్రానైట్ రాళ్లు పగులగొట్టిన వ్యక్తినైనా, ప్రస్తుతం తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనంగా మారిపోయానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి బలం తెచ్చుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Copy Vs Inspire : పాటల కాపీయింగ్ వర్సెస్ ఇన్‌స్పైర్‌ కావడం.. దేవిశ్రీ ప్రసాద్‌ సంచలన కామెంట్స్

తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణలో ప్రారంభించానని, అయితే తన కర్మభూమి ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రేమకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, తన ఆరోగ్య సమస్యలతో బాధపడినప్పుడు కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోసినట్లు భావిస్తున్నానని చెప్పారు. తన చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యులు తనకు ఆస్తమా ఉండేదని, ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చేదని చెప్పారు. కానీ, తన లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా, ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం మరింత ముందుకు సాగాలని, ప్రజల మద్దతుతో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

  Last Updated: 15 Mar 2025, 12:18 PM IST