Pawan Phobia: జగన్ కు పవన్ ఫోబియా! నిజాంపట్నం సభలో అరగంట పైగా జనసేనాని గురించే స్పీచ్

నిజాంపట్నం సభలో తొలిసారి అరగంట పాటు దత్తపుత్రుడు అంటూ Pawan మీద జగన్ విరుచుకు పడ్డారు. పదేళ్ల పాటు ఎన్ని పార్టీలతో జనసేనాని పొత్తు పెట్టుకున్నాడు అనేది విడమరిచి చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
CBN Dilemma

Pawan Phobia To Jagan! Speech About Janasena For More Than Half An Hour In Nizampatnam Sabha

Pawan phobia to Jagan : ‘ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకుంటారు. ఎన్ని సార్లైనా విడాకులు తీసుకుంటారు.’ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు ఎత్తకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దెప్పిపొడిచారు. నిజాంపట్నం సభలో తొలిసారి అరగంట పాటు దత్తపుత్రుడు అంటూ పవన్ మీద జగన్ విరుచుకు పడ్డారు. పదేళ్ల పాటు ఎన్ని పార్టీలతో జనసేనాని పొత్తు పెట్టుకున్నాడు అనేది విడమరిచి చెప్పారు. కేవలం ప్యాకేజీ కోసం పార్టీ పెట్టుకొని చంద్రబాబు కోసం పనిచేస్తున్నాడని ఆరోపించారు. సినిమా షెడ్యూల్ లేనప్పుడు చంద్రబాబు స్క్రిప్ట్ తీసుకొని ఏపీకి వస్తాడని దుయ్యబట్టారు. గెలిస్తే అమరావతి ఓడితే జూబ్లిహిల్స్ లో చంద్రబాబు, పవన్ (Pawan) ఉంటారని అన్నారు. కానీ , తాను మాత్రం తాడేపల్లి నివాసంలోనే ఉంటానని హామీ ఇచ్చారు.

గజదొంగలు మాదిరిగా ఏపీని దోచుకోవడానికి తయారయ్యారని తీవ్ర స్వరంతో ఆరోపణలకు దిగారు. సీఎం పదవి వద్దు అంటూ చంద్రబాబు ను గెలిపించాలని పవన్ చెప్పడం ప్యాకేజి కోసం పార్టీ పెట్టారని చెప్పడానికి నిదర్శనమని చెప్పారు. ఇలా పలు రకాలుగా విమర్శిస్తూ పవన్ మీద అరగంటకు పైగా నాన్ స్టాప్ గా ఆరోపణలకు దిగిన జగన్మోహన్ రెడ్డి వాలం చూస్తుంటే టీడీపి, జనసేన, బీజేపీ పొత్తు కలవరపరుస్తుందని అర్ధమవుతుంది.

మొదటి నుంచి పవన్ మీద వ్యతిరేకంగా జగన్ ఉన్నప్పటికీ బుధవారం నిజాంపట్నం సభలో మాదిరిగా టార్గెట్ చేయలేదు. ఈ సారి పూర్తి స్థాయిలో పవన్ మీద ఆరోపణలు గుప్పించారు. ఫలితంగా పొలిటికల్ హీట్ ఏపీలో పెరిగింది. పెళ్లిళ్లు, విడాకులు అంటూ చేసిన ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల క్యాడర్ యుద్ధానికి దిగారు.

వాస్తవంగా పొత్తు అంశం ఇటీవల వరకు గుమ్మనంగా ఉంది. పొత్తు ఉంటుందని పవన్ (Pawan) క్లారిటీ ఇవ్వగానే రాజకీయ హీట్ పెరిగింది. సర్వేల ప్రకారం జనసేన, టీడీపీ పొత్తు హిట్ అంటూ అంచనా వేస్తున్నాయి. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విఫల ప్రయోగమని చెబుతుంది. కానీ, బీజేపీని వీడి రాలేకపోతున్న పవన్ తెగతెంపులు చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ విషయాన్ని నిజాంపట్నం వేదికపై జగన్ చెప్పడం విశేషం. అంటే, టీడీపీ, జనసేన, కమ్యూనిస్టుల పొత్తు ఖరారు కానుందని సంకేతాలు జగన్ ఇచ్చారు.

ఎందుకంటే, త్వరలో బీజేపీ తో కూడా విడాకులు తీసుకోవడానికి పవన్ సిద్ధం అవుతున్నారని జగన్ భావిస్తున్నారు. అంతే కాదు, గతంలో విడాకులు ఇచ్చిన కమ్యూనిస్టులను తో మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదని జగన్ అన్నారు. ఇదే సమయంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మీడియా ముందు కొచ్చారు. రాబోవు ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు , టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించారు. దీంతో పొత్తుల పంచాయితీ ఏపీలో కొత్త రూపం దాల్చుతుందని జగన్ ఆందోళన నిజాంపట్నం ప్రసంగంలో వినిపించింది. అందుకే పవన్ మీద నాన్ స్టాప్ గా ఆరోపణలు, విమర్శలు జగన్ గుప్పించారు. ఫలితంగా ఎన్నికల వాతావరణం అప్పుడే ఏపీ కనిపిస్తోంది.

Also Read:  Rahul Gandhi US Tour: రాహుల్ అమెరికా పర్యటనపై ఉత్కంఠ…

  Last Updated: 16 May 2023, 10:35 PM IST