Site icon HashtagU Telugu

Motha Mogiddam : పవన్ కళ్యాణ్ కూడా మోత మోగిస్తాడా..?

Pawan Motha Mogiddam

Pawan Motha Mogiddam

TDP Motha Mogiddam : చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ‘మోత మోగిద్దాం’ (Motha Mogiddham) అనే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే.. చంద్రబాబు గారికి మద్దతుగా… సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి’ (Motha Mogiddham) అంటూ నారా లోకేష్ (Nara Lokesh) పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా కూడా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని లేదా విజిల్ వేయాలన్నారు. రోడ్డు మీద వాహనంతో ఉన్న వారు హారన్ కొట్టాలన్నారు. ఎవరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా చంద్రబాబు (Chandrababu) కు ప్రజల్లో ఉన్న మద్దతును దేశ వ్యాప్తంగా చాటాలని టీడీపీ భావిస్తోంది.

ఈ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు , నందమూరి అభిమానులు మోత మోగించేందుకు (Motha Mogiddham) సిద్ధం అవుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మోత మోగిస్తాడా..? అనేది ఇప్పుడు అంత ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ తో జనసేన పొత్తు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ – జనసేన కలిసే కార్యక్రమాలు చేస్తుంది. రేపటి నుండి మొదలు కాబోతున్న 4 వ విడుత వారాహి యాత్ర కు సైతం టీడీపీ సపోర్ట్ ఇచ్చింది. ఈ యాత్ర లో టీడీపీ నేతలు , శ్రేణులు , అభిమానులు పాల్గొనబోతున్నారు.

Read Also : Jeevan Reddy: అభివృద్ధిలో అర్మూర్ ను పరుగులు పెట్టిస్తున్నా: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) కూడా నారా లోకేష్ పిలుపు మేరకు మోత మోగిస్తాడా..? లేదా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. పవన్ మోత మోగిస్తే..ఓ రకమైన చర్చ, చేయకపోతే మరో రకమైన చర్చ జరగడం ఖాయం. చూద్దాం 07 గంటలకు పవన్ ఏంచేస్తాడో..?