Site icon HashtagU Telugu

Pawan : సరికొత్త కార్యక్రమానికి పవన్ శ్రీకారం..టైటిల్ అదిరిపోయిందంటున్న శ్రేణులు

June4th Pandaga

June4th Pandaga

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం (1 Year) పూర్తవుతున్న సందర్భంగా జనసేన పార్టీ (Janasena) ‘సుపరిపాలన మొదలై ఏడాది – పీడ విరగడై ఏడాది’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైసీపీ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టిన ఘట్టానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, దీన్ని ప్రజాపండుగలా మార్చాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పాలన సాగిస్తోందని వెల్లడించారు.

Tragedy : బీహార్‌లో దారుణం.. 9 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం.. ఆస్పత్రికి వెళితే..!

ఈ సందర్భంగా జూన్ 4న పండుగ వాతావరణం కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇంటి వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సంక్రాంతి, దీపావళి ఉత్సవాలను కలిపినట్టుగా దీన్ని జరుపుకోవాలని, దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలనీ, ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలను డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలు చెబుతున్నారు.

HHVM : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై నిర్మాత కీలక అప్‌డేట్

ఇదే సమయంలో పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా దళిత మహిళ వాకపల్లి దేవి సూర్యప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ విప్ హరిప్రసాద్ హాజరై రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తొలి నుంచి పెద్దపీట వేస్తోందని, ఇప్పటికే 8 లక్షల మంది రైతులకు రూ. 12,400 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ఘనత తమదేనని తెలిపారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు, పింఛన్ల పంపిణీ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో ప్రజలకు విశ్వాసం కలిగించేలా పాలన సాగుతుందని వెల్లడించారు.

Exit mobile version