Pawan Wife : తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా

Pawan Wife : తిరుమల శ్రీవారి అనుగ్రహంతో తన కుమారుడు బాగున్నాడని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు

Published By: HashtagU Telugu Desk
Anna Tirumala

Anna Tirumala

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అనా కొణిదెల (Anna Lezhneva) తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) దర్శనార్థం రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సాయంత్రం ఆమె రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విషయం జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. రేపు (సోమవారం) వేకువజామున తిరుమలలో సుప్రభాత సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది.

Kailasapatnam : బాణసంచా ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

తాజాగా సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో తమ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో దీనికి కృతజ్ఞత సూచనగా తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడం కోసం ఆమె తిరుమలకు చేరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి అనుగ్రహంతో తన కుమారుడు బాగున్నాడని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. రీసెంట్ గా సింగపూర్‌లోని ఓ కుకింగ్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం కోలుకున్న మార్క్‌ను పవన్ కళ్యాణ్ మరియు అనా కొణిదెల స్వదేశానికి తీసుకొచ్చారు.

  Last Updated: 13 Apr 2025, 07:56 PM IST