Site icon HashtagU Telugu

Pawan kalyan Varahi: వారాహి.. రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్!

pawan bus

Cropped (3)

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan kalyan)చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అని ప్రకటించారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు.

దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు.. వారాహి!

ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు.. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.

Also Read: Visakhapatnam: రైలు కింద ఇరుక్కున్న యువతి.. కాపాడిన రైల్వే సిబ్బంది