Nagababu: అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం: నాగబాబు

Nagababu:  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేన సీట్ల పంపకంపై కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఈ వ్యవహరంపై మాట్లాడారు. ‘‘జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. ‘‘అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న […]

Published By: HashtagU Telugu Desk
Nagababu Pawan Kalyan

Nagababu Pawan Kalyan

Nagababu:  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేన సీట్ల పంపకంపై కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఈ వ్యవహరంపై మాట్లాడారు. ‘‘జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు.

‘‘అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తరవాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించడమవుతుంది. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’ అని నాగబాబు తేల్చి చెప్పారు. ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖరావం పూరించి ప్రజాక్షేత్రంలో వెళ్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రచార హోరు మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది.

Also Read: Kamal Hassan : ఒక్క సాంగ్ కోసం కమల్ అంత వర్క్ చేశారా..?

  Last Updated: 27 Mar 2024, 10:08 AM IST