Site icon HashtagU Telugu

Parent-Teacher Meeting : విద్యార్థులతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్

Pawan Parent Teacher Meetin

Pawan Parent Teacher Meetin

ఏపీ వ్యాప్తంగా శనివారం పేరెంట్స్ – టీచర్స్ మెగా సమావేశాన్ని (Parent-Teacher Meeting) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawankalyan), విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minster Lokesh)లు పాల్గొన్నారు.

కడప మున్సిపల్ హైస్కూలు(Kadapa Municipal High School)లో జరిగిన పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్కూలులోని రంగవల్లులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా మాట్లాడారు. “విద్యార్థులను అభినందిస్తూ..మీరు మంచి లక్ష్యాన్ని సాధించాలని , సమాజంలో మంచి మార్పు తీసుకురావాలంటే చదువు అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యాభ్యాసం వల్ల జీవితంలో పెద్ద విజయాలను సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్బంగా ఓ తరగతి గదిలోకి పవన్ వెళ్లగా.. ఆయనను చూసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. జనసేనాని విద్యార్థులతో కొంత సమయం గడిపి..పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత, పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం..ఫోటోలు దిగడం చేసారు.

బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థులతో ముచ్చటించి ఎలా చదువుతున్నారు. వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు దృష్టిసారించాలని, తద్వారా వారు మరింత మెరుగ్గా విద్యలో రాణించేలా చూడాలని సూచించారు.

Read Also : Kuppam : చంద్రబాబు ఇలాకాలో పుష్ప 2 థియేటర్స్ సీజ్ ..షాక్ లో ఫ్యాన్స్