Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు.. ఆనందంగా ఉందంటూ పవన్​ కల్యాణ్​ ట్వీట్‌

సామర్లకోట, ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan tweets that he is happy about another step forward in the development of Pithapuram.

Pawan Kalyan tweets that he is happy about another step forward in the development of Pithapuram.

Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన శాఖల పరిధిలో కీలక సంస్కరణలపై దృష్టి పెడుతూనే.. మరోవైపు తను అసెంబ్లీలో అడుగుపెట్టేలా ఆశీర్వదించిన పిఠాపురం నియోజకవర్గంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు. ఈక్రమంలోనే పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Read Also: Wildfire : దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి

ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసి అండగా నిలిచిన ప్రధాని మోడీ, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ అండ్‌ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట, ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపడుతున్నాం అన్నారు.

Read Also:  Ippala Ravindra Reddy : అప్పుడు చంద్రబాబును తిట్టి..ఇప్పుడు లోకేష్ కు దగ్గర అవుతున్నాడా..?

  Last Updated: 26 Mar 2025, 02:41 PM IST