Pawan Kalyan : ఈరోజుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ క్రమంలోనే శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎన్‌ఆర్ఈజీఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని తెలిపారు. నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజలు పనిని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.
ఇక అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రూ. 5400 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని పవన్ విమర్శించారు.
మరోవైపు అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్‌లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు(పీఏసీ) , అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.
Read Also: 6-6-6 Walking : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 6-6-6 వాకింగ్ రొటీన్