Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు హీరోల గురించి మాట్లాడుతున్నాడు? అందుకేనా? ఫ్యాన్స్ ఏమంటున్నారు?

ఇన్నేళ్ల రాజకీయ స్పీచ్ లలో ఎప్పుడూ వేరే హీరోల ప్రస్తావన తీసుకురాలేదు. పొలిటికల్ స్పీచ్ లలో అస్సలు తీసుకురాలేదు. కానీ వారాహి యాత్ర మొదలైన దగ్గర్నుంచి పవన్ అదేపనిగా వేరే హీరోల గురించి మాట్లాడుతున్నాడు.

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 06:24 PM IST

జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో రెండు ఎలక్షన్స్ జరిగాయి. మొదటి ఎలక్షన్స్ లో రాష్ట్రం కోసం అంటూ చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చి పోటీ చేయకుండా ఉన్నాడు. రెండో సారి ఏమైందో తెలీదు కానీ ఒంటరిగా పోటీచేశాడు. ఒక్క సీటు గెలిచినా చివరికి అది కూడా పోయినట్టే అయింది. ఇక తాను పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోవడంతో కొద్దిగా డీలా పడ్డాడు. ఇన్నాళ్లు సినిమాలు, రాజకీయాలు రెండుపడవలపై కాళ్ళు వేసి నడుస్తున్నాడు.

మరి కొన్ని నెలల్లో ఏపీ ఎలక్షన్స్ ఉండటంతో ఎక్కువగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నాడు పవన్. ఈ సారి మాత్రం ఎలా పోటీ చేస్తాడో క్లారిటీగా చెప్పట్లేదు. ఈసారి కూడా బీజేపీ, టీడీపీ పొత్తుతోనే లేదా ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీ పొత్తుతోనో జనసేన పోటీచేస్తారని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పుడూ లేనిది ఈ సారి స్పీచ్ లు డిఫరెంట్ గా ఉంటున్నాయి. పవన్ స్పీచ్ లు బాగుంటాయని, పవన్ పొలిటికల్ స్పీచ్ లకి కూడా అభిమానులు ఉన్నారు. అయితే ఈసారి పవన్ తన స్పీచ్ లలో ఎక్కువగా రెండు పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నాడు.

ఒకటి.. అసలు వైసీపీని అధికారంలోకి రానివ్వనని, అందుకోసం ఏం చేయడానికి అయినా రెడీ అంటున్నాడు. జనసేన సింగల్ గా పోటీ చేసి గెలిచే స్థాయి లేదు కాబట్టి కచ్చితంగా పొత్తు ఉంటుందని ఈ మాటలతో అర్ధం అయిపోతుంది.
ఇక రెండోది.. హీరోల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఇన్నేళ్ల రాజకీయ స్పీచ్ లలో ఎప్పుడూ కూడా వేరే హీరోల ప్రస్తావన తీసుకురాలేదు. అది కూడా పొలిటికల్ స్పీచ్ లలో అస్సలు తీసుకురాలేదు. కానీ వారాహి యాత్ర మొదలైన దగ్గర్నుంచి పవన్ అదేపనిగా వేరే హీరోల గురించి మాట్లాడుతున్నాడు.

పవన్ ఈ సారి తన స్పీచ్ లలో..

*సినిమా వేరు, రాజకీయం వేరు..
*నాకు అందరు హీరోలు ఇష్టం, మేము అందరం బాగానే ఉంటాం. నాకు అందరి మీద గౌరవం ఉంది.
*మహేష్ బాబు, ప్రభాస్ నాకంటే పెద్ద హీరోలు, ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ హీరోలు, వాళ్ళు నా కంటే గొప్ప అని చెప్పుకోడానికి ఈగో లేదు నాకు.
*మహేష్, ప్రభాస్, కొంతమంది హీరోలు నా కంటే ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటారు అందుకు నేను జెలసీ ఫీల్ అవ్వట్లేదు.
*ప్రభాస్ పెద్ద సినిమాలు చేసి ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నాడు.
*సినిమా హీరోలంతా కష్టపడి సంపాదించి, ట్యాక్సులు కూడా కడుతున్నారు.
*మీరు ఏ హీరోని అయినా ఇష్టపడండి కానీ రాజకీయాల్లో నాకు సపోర్ట్ చేయండి.. అంటూ ఎక్కువగా మాట్లాడుతున్నారు.

పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రం హీరోలందరూ ఒక్కటే అని, అభిమానులు అందరూ కలవాలని, రాష్ట్రం కోసం అందర్నీ కలవమని పవన్ చెప్తున్నాడని అంటున్నారు.

అయితే పవన్ ఇలా వేరే హీరోల గురించి మాట్లాడుతుంటే పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువగా వస్తుంది. అసలు పవన్ వేరే హీరోలని తన కంటే పెద్ద హీరోలని, వాళ్ళు తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, వాళ్ళు నా కంటే సక్సెస్ ఎక్కువ అని చెప్తుంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. పవన్ తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడటం పవన్ అభిమానులకు నచ్చట్లేదు. పవన్ మాటలు ఫ్యాన్ వార్స్ కి కూడా దారి తీస్తున్నాయి.

ఇక వేరే హీరోలు, పార్టీ నాయకులు, వేరే పార్టీల అభిమానులు.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా హీరోల గురించి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్స్ కోసమా? పొలిటికల్ స్పీచ్ లలో హీరోల పేర్లు ఎందుకు తేవడం? పవన్ ఫ్యాన్స్ ఓట్లు వెయ్యట్లేదు కాబట్టి వేరే హీరోల ఓట్లు అడుక్కుంటున్నాడా? పవన్ కి సపోర్ట్ గా మరి వేరే హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు? సినిమా వాళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ కూడా ఇలాగే కామెంట్స్ చేస్తున్నారు.

ఇక గోదావరి జిల్లాల్లో సినిమా ప్రభావం ఎక్కువ. భీమవరం సైడ్ అయితే పవన్ కి, ప్రభాస్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆ జిల్లాల్లో వారాహి యాత్ర జరుగుతుంది కాబట్టి ఎక్కువగా సినిమా హీరోల గురించి, ఎక్కువగా ప్రభాస్ గురించి మాట్లాడుతున్నాడని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు సినిమా హీరోల గురించి మాట్లాడకుండా ఇప్పుడు వరుసగా హీరోల గురించి మాట్లాడుతుండటంతో పవన్ కి ప్లస్ అవ్వడం కంటే మైనస్ ఎక్కువ అవుతుంది. ముందు తన అభిమానుల్లోనే దీనిపై వ్యతిరేకత వస్తుంది. చూడాలి మరి ఈ సినిమా పొలిటికల్ స్పీచ్ లు ఈ సారి జనసేనకు ఎంత మైలేజ్ ని తీసుకొస్తాయో.

 

Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. వారాహి యాత్రకు స్మాల్ బ్రేక్