Pawan First Signature : డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రెండు కీలక ఫైల్స్ ఫై సంతకం..

ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు

  • Written By:
  • Publish Date - June 19, 2024 / 02:53 PM IST

విజయవాడ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం (AP Deputy CM )గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రెండు కీలక ఫైల్స్ ఫై సంతకం చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో.. ఆయన టేబుల్‌పై ఓ బుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏంటా ఆ బుక్ అని అరా తీశారు. పవన్ కళ్యాణ్‌కు ముందు నుండి పుస్తకాలు పురుగు అని తెలిసిందే. కాస్త సమయం దొరికినప్పుడే కాదు..వీలు చూసుకొని కూడా ఎక్కవులాగా బుక్స్ చదవడం చేస్తుంటారు. అలాగే రచనలు అంటే చాలా ఇష్టం.. సాహిత్యంపై ఆసక్తి ఉందని చెబుతుంటారు. ఎక్కువగా ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పవన్ చదువుతుంటారు. తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఈ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని రాశారు.

ఈరోజు కూడా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతూ ఆ బుక్‌ను తన పక్కనే టేబుల్‌పై ఉంచుకున్నారు. అంతేకాదు ఆ పుస్తకంలో కొన్ని పదాలను ఆయన రాశారు.. ఆ బుక్‌లోని ‘ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత’ అంటూ రాసిన వాఖ్యాలను గుర్తు చేసుకుంటారు. అందుకే పవన్ తనకు ఇష్టమైన శాఖలు దక్కించుకున్నారని తెలుస్తుంది.

ఇక ఈ శాఖల్లో మెరుగు పరచాల్సింది చాల ఉంది. సచివాలయాల వ్యవస్థ తెచ్చి పంచాయతీరాజ్ ను జగన్ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు గాడిన పెట్టుకోవాల్సి అవసరం ఎంతో ఉంది. రూరల్ లో నీటి సమస్యను పరిష్కరిస్తే పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోతారు. అటవీ పర్యావరణానికి జగన్ హయాంలో జరిగిన విధ్వంసానికి విరుగుడు కనిపెట్టాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ అయినా ఇన్ స్టంట్‌గా సమస్యలు పరిష్కరించలేరు. మొదట నిర్ణయాలు తీసుకుని వాటిని క్రమబద్ధంగా అమలు చేసుకుంటూ వెళ్లాలి,. అప్పుడే ఫలితాలు వస్తాయి. మరి పవన్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Read Also : 484 Jobs : టెన్త్ పాసయ్యారా ? బ్యాంకులో 484 జాబ్స్ మీకోసమే