జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మొదటి స్పందన తెలిపారు. శాంతి, అహింస నినాదాలతో ముందుకెళ్తున్న దేశాన్ని కొంతకాలంగా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. పండిట్లను, హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇటీవలి ఉగ్రవాద దాడిలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడాన్ని ఆయన గుండెను కలిచేసిందని పేర్కొన్నారు. భారత్ ఇక మౌనంగా ఉండకూడదని, సైన్యం చేపట్టిన చర్యలు సరికొత్త యుద్ధానికి నాంది కావాలన్నారు.
Crack Heels: మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై దేశం కఠినంగా స్పందించాలన్నది తన అభిప్రాయం అని, దేశ భద్రతకు వ్యతిరేకంగా, పాక్ మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దేశం మొత్తం మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
చివరిగా మతం ఆధారంగా వివక్షలు ఉండకూడదని, దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న సమస్యలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమ వలసదారుల ప్రవేశం వల్ల దేశ భద్రతకే కాదు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలపైనా ప్రభావం పడుతోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం ఉగ్ర స్థావరాలను నాశనం చేయడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ధ్వంసమయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.