Site icon HashtagU Telugu

AP : సీఎం జగన్ కు పవన్ ఫోన్..

Pawan Phone To Cm Jagan

Pawan Phone To Cm Jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ..సీఎం జగన్ (CM Jagan) కు ఫోన్ చేశారట. అదేంటి పవన్ ..జగన్ కు ఫోన్ చేయడం..టిడిపి తో పొత్తు ఓకే అయ్యింది కదా..మళ్లీ ఇప్పుడు జగన్ కు ఫోన్ చేయడం ఏంటి అని అనుకుంటూ…ఖంగారుకు గురి అవుతున్నారా..? అంతగా ఖంగారు అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసింది..ఇప్పుడు కాదులెండి..2019 లో జరిగింది ఇది. ఈ విషయాన్నీ నిన్న పార్టీ విస్తృత సమావేశంలో పవన్ చెప్పుకొచ్చాడు.

రాబోయే ఎన్నికల్లో జనసేన..టీడీపీ తో కలిసి పోటీ చేయబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా పవన్ కళ్యాణ్ నాల్గు రోజుల క్రితం చెప్పడం జరిగింది. పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పార్టీ నేతలు , వీరమహిళలతో పార్టీ విస్తృత సమావేశం (Janasena Party Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో..ఇక నుండి టీడీపీ నేతలతో కలిసి ఎలా పనిచేయాలో..అధికారం లోకి రావాలంటే ఏంచేయాలో వంటి విషయాలను తెలియజేసారు.

ఇదే సందర్బంగా జగన్ ఫై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ (Jagan) ఓ సైకో అని, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని పవన్ అన్నారు. అలాగే గతంలో జగన్ కు తాను ఫోన్ చేసినట్లు తెలిపారు. ఆ సమయలో జగన్ తనకు గౌరవం ఇవ్వలేదని అన్నారు.”2019 ఎన్నిక‌ల అనంత‌రం ఒక‌సారి తాను జ‌గ‌న్‌ కు ఫోన్ చేశాను.. నేను ఆయ‌న్ని సార్ సార్ అని సంబోధిస్తుంటే.. జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ ప‌వ‌న్ అంటూ నన్ను ఏక‌వ‌చ‌నంతో మాట్లాడారు. 151 సీట్లలో గెలిచిన అహంకారం అప్పుడు జ‌గ‌న్ మాటల్లో క‌నిపించింది” అని పవన్ తెలిపారు.

Read Also : Varun Tej- Lavanya Tripathi : మెగా ‘పెళ్లి సందడి ‘ మొదలైంది

నాలుగేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు భరించాను.. ఇకపై ఊరుకునేది లేద‌ని ప‌వ‌న్ హెచ్చరించాడు. ఇదే సమయంలో… త‌న‌ను ఏపీలోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని, ఇలా ప‌లుమార్లు త‌న ప‌ర్యట‌న‌ల‌ను అడ్డుకున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేసిన పవన్… ఒక‌ప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఆ రాష్ట్రంలోకి వెళ్లడానికి పాస్ పోర్ట్, వీసా అవ‌స‌రం అవుతుంద‌ని వ్యాఖ్యానించార‌ని.. అయితే జ‌గ‌న్ మాత్రం ఏపీలోకి ఎవ‌రు రావాల‌న్నా వీసా, పాస్ పోర్ట్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి క‌ల్పించాడ‌ని ఎద్దేవా చేశారు.