Site icon HashtagU Telugu

Pawan – Chandrababu : బాబు వద్ద నేర్చుకుంటా – పవన్ కళ్యాణ్

Pawan Babu

Pawan Babu

ఏపీకి చంద్రబాబు అనుభవం అవసరమని , రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తప్పించేందుకు, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని మరోసారి స్పష్టం చేస్తూ చంద్రబాబు ఫై తన అభిమానాన్ని చాటుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేటి నుండి ఏపీలో ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో (Grama Sabhalu) గ్రామా సభలు మొదలు అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మార్కు పరిపాలనతో దేశచరిత్రలో నిలిచిపోయేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని మైసూరువారిపల్లిలో జరిగిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని పవన్ కల్యాణ్​ అన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని తాను వదలుకోనని, మనుషులను కలుపుకొనే వ్యక్తినని, విడగొట్టేవాణ్ని కాదని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్న పవన్, 13 వేల 326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తప్పించేందుకు, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని పవన్ చెప్పుకొచ్చారు. బాధ్యతల నుంచి తాము పారిపోమని, నిరంతరం పనిచేస్తామని తెలిపారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని, గుండెల నిండా నిబద్ధత ఉందన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని తాను చాలా సభల్లో చెప్పానని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే అని కొనియాడారు. లక్షలమందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వగలిగారన్న పవన్, నాకంటే బాగా ఆలోచించగలిగేవాళ్ల వెంట నడిచేందుకు తానేమీ సంకోచించనని తెలిపారు. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందన్నారు.

పంచాయతీలకు ప్రభుత్వ పరంగా ఆస్తులు లేకపోతే వ్యర్థమని పవన్ చెప్పారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకోబోమని… అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని చెప్పారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఉంటే నిర్మాణాలు చేసుకోవచ్చని చెప్పారు. దాతలు ముందుకు రావాలని… తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న పవన్, ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటానని, అండగా ఉంటానని తెలిపారు. పదవి తనకు అలంకారం కాదని, బాధ్యతగా ఉంటానన్నారు. తానెప్పుడు పనిచేసేందుకే సిద్ధంగా ఉంటానని, ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని ఆకాంక్షించారు.

Read Also : Water After Food : తిన్న వెంటనే నీళ్లు త్రాగడం మంచిదా కాదా..? నిపుణుల నుండి తెలుసుకోండి..!