Pawan Kalyan : వదిలేస్తే ఈయన నైట్ టైం కూడా డ్యూటీ చేసేలా ఉన్నాడు..

వదిలేస్తే ఈయన నైట్ టైం కూడా డ్యూటీ చేసేలా ఉన్నాడు

Published By: HashtagU Telugu Desk
Pawan Uppada

Pawan Uppada

బాహుబలి (Baahubali) సినిమాలో ప్రభాస్ (Prabhas)..గురించి నాజర్ ఓ మాట అంటాడు..ప్రాణాలతో ఉంటె వీడు ఎక్కడున్నా రాజేరా..అని, ఇప్పుడు ఏపీ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి కూడా అధికారులు ఇలా మాట్లాడుకుంటున్నారు…’వదిలేస్తే ఈయన నైట్ టైం కూడా డ్యూటీ చేసేలా ఉన్నాడు’. ప్రస్తుతం పవన్..అధికారులను ఆ రేంజ్ లో పరుగులు పెట్టిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి గా , పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి కూడా తాను నిద్ర పోవడం లేదు..అధికారులను నిద్ర పోనివ్వడం లేదు. తమకు ఇంత పని ఉంటుందా..? అని అధికారులంతా మాట్లాడుకుంటున్నారు. ఆ విధంగా పనిచేయిస్తున్నాడు. అర్ధరాత్రి..అపరాత్రి లేదు..నిత్యం ప్రజల సమస్యలను ఎలా తీర్చాలని..? రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలి..? ఏంచేస్తే రాష్ట్రం బాగుంటుంది..? ప్రజలు సంతోషంగా ఉంటారు..? అనే వాటి గురించే ఆలోచిస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఓ పక్క వారాహి దీక్ష ఉంటూ..ఆహారం తీసుకోకుండా కేవలం పండ్లు , ఫలహారాలు మాత్రమే స్వీకరిస్తూ…ప్రతి రోజు అధికారులతో మాట్లాడుతూ..ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే..మరోపక్క నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉప్పాడ లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. అంతకు ముందు ఉప్పాడ కు వస్తూ..రోడ్ పక్కన ఓ పిల్లాడు జనసేన జెండా పట్టుకొని నిల్చుండడం చూసి.. వెంటనే కాన్వాయ్ ఆపి… అప్యాయంగా పలకరించాడు.

ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాన్‌, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సముద్రం కోతకు గురవుతున్న సమయంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. గతంలో జరిగిన ఘటనలను ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా.. అవి తిలకించిన పవన్‌.. వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సముద్ర కెరటాలు దాటికి మాయపట్నం నుంచి కొత్తపట్నం వరకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయని పరిశీలించారు. తీర ప్రాంత ప్రజల రక్షణకు తీసుకోవలసిన చర్యలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమీక్షించారు. వాకతిప్ప గ్రామంలో సూరప్ప త్రాగునీటి చెరువును పరిశీలించి, మంచినీటి లైన్ ఏ విధంగా వెళ్తుంది.. వాటర్ ఏవిధంగా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనేవి అడిగి తెలుసుకున్నారు. ఇలా పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నది చూసి అభిమానులు , ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు మాత్రం ఈయన్ను ఇలాగే వదిలేస్తే నైట్ కూడా డ్యూటీ చేస్తాడు కావొచ్చు అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.

Read Also : Vi New Recharge Plans: వొడాఫోన్ ఐడియా యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఈరోజే చివ‌రి అవ‌కాశం!

  Last Updated: 03 Jul 2024, 03:24 PM IST