Modi, Pawan Alliance: మోడీ, ప‌వ‌న్ `విలీనం` వెనుక‌..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీని విశాఖ కేంద్రంగా జ‌నసేనాని ప‌వ‌న్ ఎట్టకేల‌కు క‌లిశారు. గ‌త మూడున్న‌రేళ్లుగా ల‌భించ‌ని అవ‌కాశం ఆయ‌న‌కు దక్కింది. వాళ్లిద్ద‌రూ సుమారు 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. అయితే, ఏమి చర్చించుకున్నారు? అనేదిదానిపై ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది. మోడీ, ప‌వ‌న్ `విలీనం`పై(క‌ల‌వ‌డం) ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ వైసీపీ సోష‌ల్ మీడియాలో నిండిపోతోంది.

  • Written By:
  • Updated On - November 12, 2022 / 04:37 PM IST

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోడీని విశాఖ కేంద్రంగా జ‌నసేనాని ప‌వ‌న్ ఎట్టకేల‌కు క‌లిశారు. గ‌త మూడున్న‌రేళ్లుగా ల‌భించ‌ని అవ‌కాశం ఆయ‌న‌కు దక్కింది. వాళ్లిద్ద‌రూ సుమారు 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. అయితే, ఏమి చర్చించుకున్నారు? అనే దానిపై ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది. మోడీ, ప‌వ‌న్ `విలీనం` పై (క‌ల‌వ‌డం) ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ వైసీపీ సోష‌ల్ మీడియాలో నిండిపోతోంది.

ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారేలా రోడ్ మ్యాప్ వ‌స్తుంద‌ని జ‌న‌సేన ఊహించింది. కానీ, అలాంటి ప‌రిస్థితి లేద‌ని ప‌వ‌న్ మీడియా ముఖంగా మాట్లాడిన ముక్త‌స‌రి మాట‌ల ద్వారా అర్థం అవుతోంది. ఏపీకి మంచి రోజులు వ‌స్తాయ‌ని చెబుతూ శుక్ర‌వారం రాత్రి భేటీ ముసిగిన త‌రువాత‌ వీలున్నంత వేగంగా కెమెరాల ముందు నుంచి ప‌వ‌న్ వెళ్లిపోయారు. అంటే, ప‌వ‌న్ అనుకున్న విధంగా మోడీ నుంచి సానుకూల స్పంద‌న లేద‌ని అర్థం అవుతోంది.

Also Read:  TDP, BJP and Janasena: తెలంగాణపై ‘ఆంధ్రా’ పొత్తులు.. మోడీ వ్యూహం ఫలించేనా!

వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఎలాంటి చ‌ర్చ జ‌రిగి ఉంటుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అయితే, దీనిపై ప‌లు ఊహాగానాల‌కు అవ‌కాశం ఏర్ప‌డింది. పొత్తు పెట్టుకున్న తొలి రోజుల్లో ఢిల్లీ పెద్ద‌లు విలీనం గురించి ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని ప‌వ‌న్ ప‌రోక్షంగా వెల్ల‌డించారు. ఆ విష‌యాన్ని జ‌న‌సేన స‌మావేశంలోనే ఆయ‌న వెళ్ల‌గ‌క్కారు. ఆ రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ లేదు. అంటే, ఆ ష‌ర‌తుకు అంగీక‌రిస్తే క‌లిసే అవ‌కాశం దొరికేద‌ని ఏపీ బీజేపీలోని కొంద‌రు అప్పుడ‌ప్పుడు వాడిని మాట‌లు. అదే ఒత్తిడిని పెంచ‌డానికి ప‌వ‌న్ ను ర‌మ్మ‌ని మోడీ ఆఫీస్ కాల్ చేసిందా? అనే అనుమానం రాక‌మాన‌దు. అందుకే, మోడీతో భేటీ త‌రువాత మీడియా ముందుకొచ్చిన ప‌వ‌న్ `డ‌ల్ `గా ఉన్నారా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఇక ఆవిర్భావ స‌భ‌లో నాలుగు ఆప్ష‌న్ల‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. వాటిలో దేన్ని అమ‌లు చేయాల‌న్నా బీజేపీ అనుమ‌తి అవ‌స‌రం. అందుకే, రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ప‌వ‌న్ చెప్పారు. చివ‌రి ఆప్ష‌న్ ఒంట‌రిగా వెళ్ల‌డాన్ని ఆయ‌న ఎంచుకున్నారు. అదే జ‌రిగితే, 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు పున‌రావృతం అవుతాయ‌ని జ‌నసేన‌కు తెలుసు. అందుకే, తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ముందుకు వ‌స్తోంది. అదే స‌మ‌యంలో బీజేపీని క‌లుపుకుని వెళ్లాల‌ని భావిస్తోంది. అయితే, టీడీపీతో క‌లిసి న‌డ‌వ‌డానికి బీజేపీ ముందుకు రావ‌డంలేదు. ఇక్క‌డే ప‌వ‌న్ కు తిక్క‌లేస్తోంది. బీజేపీ పెద్ద‌ల‌పై చికాకు పుట్టిస్తోంది.

Also Read:   Pawan Kalyan: ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి… మోదీ తో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.!!

ప్ర‌ధాని మోడీని క‌లిసిన ప‌వ‌న్ తొలుత 5 పేజీలతో కూడిన‌ విన‌తుల‌ను అందచేశారు. వాటిని తీసుకున్న మోడీ పెద్ద‌గా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌రిగిన ముఖాముఖి చ‌ర్చ 2019 తొలి రోజుల్లో పెట్టిన `విలీనం` కండీష‌న్ మీద జ‌రిగిన‌ట్టు ఊహాగానం బ‌య‌లుదేరింది. ఆ విష‌యాన్ని వైసీపీ సోష‌ల్ మీడియా బ‌లంగా తీసుకెళుతోంది. దీనికి ఫుల్ స్టాప్ ప‌డాలంటే ప‌వ‌న్ ముందుకొచ్చి 20 నిమిషాల ముఖాముఖి గురించి వివ‌రంగా చెప్పాలి. లేదంటే, ఇదే మ‌రింత ప్ర‌చారం జ‌రిగే అవ‌కాశం ఉంది.

వాస్త‌వంగా బీజేపీ ప్రాంతీయ పార్టీల‌కు వ్య‌తిరేకం. జాతీయ పార్టీలు మాత్ర‌మే దేశంలో బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటోంది. జాతీయ‌తా వాదం బ‌ల‌ప‌డాలంటే ప్రాంతీయ పార్టీలు బ‌ల‌హీన‌ప‌డాల‌ని బీజేపీ సిద్ధాంతం. ఆ విష‌యాన్ని ప‌లు సంద‌ర్బాల్లో ఆ పార్టీ నేత‌లు చెప్పిన మాట‌. బ‌హుశా ఆ కోణం నుంచి ఆలోచించి 2019 తొలి రోజుల్లో `విలీనం` ఒత్తిడి తెచ్చి ఉంటారు. ఇప్పుడ‌దే ఒత్తిడి మోడీ, అమిత్ షా నుంచి ఉంద‌న్న సంకేతం వెళుతోంది. మొత్తం మీద రోడ్ మ్యాప్ ఏమో గానీ, మోడీ భేటీ త‌రువాత జ‌న‌సేన భ‌విష్య‌త్ పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read:  Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీల‌క కేంద్రం – ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

ఇదే విష‌యంపై జ‌న‌సేన నాయ‌కుడు ఒక‌రు ఫోన్ ద్వారా `హాష్ ట్యాగ్ `తో మాట్లాడిన‌ప్పుడు, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఏమి జ‌రిగిందో ఎవ‌రికి తెలియ‌దు. ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప‌వ‌న్ పార్టీని న‌డుపుతార‌ని అన్నారు. రాబోయే 30 ఏళ్ల వ‌ర‌కు జ‌న‌సేన పోరాడుతుంద‌ని ప‌వ‌న్ చెబుతోన్న విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌జారాజ్యం త‌ర‌హా త‌ప్పు ఈసారి జ‌ర‌గ‌ద‌ని అన్నారు. ఊహాగానాల‌కు ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని, ప‌వ‌న్ కు వ‌స్తోన్న క్రేజ్ ను చూసి వైసీపీ చేస్తోన్న అబ‌ద్ధ‌పు ప్ర‌చారంను ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని కొట్టిపారేశారు.