Chandrababu – Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఈ రోజు జూన్ 18న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు పవన్‌ కల్యాణ్‌ ని కలిశారు.

Chandrababu- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఈ రోజు జూన్ 18న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు పవన్‌ కల్యాణ్‌ ని కలిశారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు.

అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయితో కలిసి భవనాన్ని పరిశీలించిన పవన్ పై అంతస్తులో ఉంటూనే కింది అంతస్తులో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రేపు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వినియోగించిన వాహనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ప్రభుత్వం కేటాయించింది. అంతకుముందు అధికార యంత్రాంగం వైఎస్ జగన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సిద్ధం చేసింది. దీనిని ఉపయోగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాకరించడంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దానిని ఉపయోగించేందుకు అంగీకరించడంతో అదే వాహనంలో ఆయన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు.

Also Read: Rahul Gandhi : చిన్న స్పర్ధ వచ్చినా సర్కార్ ఢమాల్.. టచ్‌లోనే ఎన్డీయే నేతలు : రాహుల్‌గాంధీ