జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారిందని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని అన్నారు.
టీడీపీ పార్టీతో కనీసం పదేళ్లయినా పొత్తు కొనసాగాలని ఆశిస్తున్నామని .. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే పదేళ్లయినా పొత్తు ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము బీజేపీతో భాగస్వాములుగా ఉండడం వల్ల ముస్లింలు దూరమవుతున్నారని ప్రచారం చేస్తున్నారని .. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకుగా చూడబోనని ఉద్ఘాటించారు. ముస్లింల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి అని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. మీకు అన్యాయం జరిగితే నేను ముస్లింల వైపే ఉంటా… మీ పక్షాన గళం ఎత్తే నాయకుడ్ని నేనే అవుతా అని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లా దర్శికు చెందిన గరికపాటి వెంకట్ ఈరోజు పవన్ సమక్షంలో పార్టీ లో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ పిలుపునిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
పవన్ కళ్యాణ్ ఇలా ఉంటె…పలాస లో సీఎం జగన్ మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ అని అన్నారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు, పవన్ నాటకాలు ఆడడం పరిపాటిగా మారిందని జగన్ మండిపడ్డారు. తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు కనీసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఇద్దరు నాయకులు కూడా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన వారేనని విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ధి చేసుకోలేకపోయారని , సొంత నియోజకవర్గాన్ని విస్మరించిన చంద్రబాబు ఉత్తరాంధ్రను ఎందుకు పట్టించుకుంటాడని అన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటారు..విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తారంటూ తనదైన శైలిలో జగన్ కామెంట్స్ చేసారు.
Read Also : TS : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య కు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్