Site icon HashtagU Telugu

Pawan Kalyan – Gollaprolu : జ్వరంతో బాధపడుతూ కూడా పవన్ పర్యటన

Pawan Kalyan Comments On Fl

Pawan Kalyan Comments On Fl

Pawan Kalyan Inspecting The Flooded Areas – Gollaprolu : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనారోగ్యం బాధపడుతూ కూడా ఈరోజు ప్రజల మధ్యకు వచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency)లో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో (Eleru in the flood affected area) పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడుతూనే ఉన్నానని పేర్కొన్నారు. ఏలేరు కాలువకు భారీ గండి పడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యం తో బాధపడుతూ కూడా ఈరోజు హుటాహుటిన గొల్లప్రోలు(Gollaprolu )లోని జగనన్న కాలనీ(Jagananna Colony)కి చేరుకున్నారు.

వరద బాధితులకు అవసరమయిన సహాయాన్ని అందిస్తా – పవన్

గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనడంతో అవి మునుగుతున్నాయని చెప్పుకొచ్చారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని, వరద బాధితులకు అవసరమయిన సహాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. గత ప్రభుత్వ తప్పులను మేము సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జగనన్న కాలనీ స్థలాన్ని రూ.30 లక్షల భూమిని రూ. 60 లక్షలకు కొన్నారని విమర్శించారు.

బుడమేరు విషయంలో ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడతా – పవన్ కళ్యాణ్

బుడమేరు విషయంలో ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని ఆ ఆక్రమణలు తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని పవన్‌ అన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారని పవన్‌ కల్యాణ్ అన్నారు. ముందుగా ఆక్రమణలు గుర్తించాలని అందరితో కలిసి మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అన్నది నా అభిప్రాయమని తెలిపారు. నదీ, వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు. వరద విపత్తు నుంచి కోలుకోవడానికి విజయవాడకు సమయం పట్టొచ్చని వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు (CM Chandrababu) నిత్యం పనిచేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.

Read Also : Assembly : అసెంబ్లీలో మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం