ఏపీలో వైసీపీ (YCP) రాజ్యం ఏలుతుంది..ఇష్టారాజ్యంగా దోపిడీలు..ఎవరైనా ఎదురుతిరిగితే వారిపై అక్రమ కేసులు..తప్పు అని చెపితే చంపి డోర్ డెలివరీ చేయడం..ప్రజలను నిర్బంధం చేయడం..టాక్స్ ల పేరుతో డబ్బులు వసూళ్లు చేయడం..ఇసుక దోపిడీ..భూముల కబ్జా లు ఇలా ఒకటి ఏంటి ఎన్నో చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే అక్రమా కేసులు పెట్టి వారికీ బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో అలాగే చేసారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై కూడా అక్రమ కేసు పెట్టేందుకు..ఆయనపై అవినీతి మరక వేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కామ్ (Inner Ring Road Scam) జరిగిందని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ లో నారా లోకేష్ ను A14గా చేరుస్తు..ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే కేసులో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా ఇరికించాలని చూస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కి కాస్త దూరంలో కాజాలో పవన్ కళ్యాణ్ సుమారు రెండున్నర ఎకరాలు (368/B1) ఎన్ఆర్ఐ ప్రసాద్ దగ్గర్నుంచి (లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్) కొనుగోలు చేసారని సమాచారం.
ఇప్పుడు దీన్ని సాకుగా చూపిస్తూ కొంతమంది వైసీపీ శ్రేణులు ..పవన్ కళ్యాణ్ ఫై అవినీతి మరక వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే.. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూమి (368/B1) వాళ్లకు లాగా బినామీల పేరుతో కొనలేదు ఆయన పేరు మీదే 41 లక్షలు ఇచ్చి ఔట్ రైట్ గా కొన్నాడట. ఆరోజు అక్కడ రియల్ ఎస్టేట్ వారి ప్రకారం దాని విలువ సుమారు ఎకరం 34 లక్షలు ఉందని సమాచారం. అంటే పవన్ ప్రభుత్వ ధర కన్నా ఎక్కువ ఇచ్చే కొన్నాడని పక్కాగా తెలుస్తుంది. దీనిపై లీగల్ గా సుప్రీం కోర్టుకి వెళ్లినా పవన్ ఫై చిన్న మరక కాదు..మారేది జరగదని జనసేన శ్రేణులు అంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు దీనిపై ఏదైనా నోటీసు ఇచ్చిన అది వైసీపీ కే బొక్క తప్ప మరోటి కాదని తేల్చి చెపుతున్నారు.
Read Also : Chandrababu Arrest : చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు – నటుడు రవిబాబు