Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర పాలనలో అత్యంత బిజీగా ఉన్నారు. ఆయన తన చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా, కేరళ , తమిళనాడు పుణ్యక్షేత్రాలను సందర్శించి, ధార్మిక పర్యటనలతో పాటు ప్రజలతో సమీపంగా ఉంటున్నారు. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్ తగ్గని బంగారం ధరలు..!
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధికారికంగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేసి, “ఈ రోజు, హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ , ఇతర తత్సంబంధిత పరీక్షలు నిర్వహించబడ్డాయి. వైద్యులు పరీక్షల రిపోర్టులను పరిశీలించిన అనంతరం పలు సూచనలు ఇచ్చారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. మిగిలిన పరీక్షలు ఈ నెలాఖరులో గానీ, మార్చి మొదటి వారంలో గానీ పూర్తిచేయబడతాయి. 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు.”
పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌కు వెళ్లిన విషయంపై అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సాధారణ ఆరోగ్య పరీక్షలు మాత్రమేనని భావిస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం, జాగ్రత్తగా ఉండడం అవసరమని పలు ఫ్యాన్స్, కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు, స్కానింగ్ మిషన్లో పరీక్షలు చేయించుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
7 Planets Parade: ఫిబ్రవరి 28న ఒకే వరుసలో సప్తగ్రహాలు.. ఎలా చూడాలి ?