Site icon HashtagU Telugu

Pawan Kalyan : కుమార్తెకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్..

Pawan Kalyan Gift For Daugh

Pawan Kalyan Gift For Daugh

Pawan Kalyan Gift for Daughter : ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కుమార్తె ఆద్య (Adhya)కు గిఫ్ట్ ఇచ్చి సంతోష పెట్టారు. లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను పవన్ కళ్యాణ్..తన కూతురు ఆద్య తో కలిసి ఈరోజు(శుక్రవారం) పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు… ఇలా పలు కళాకృతులు పరిశీలించారు.

అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును కలుపుకుని కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన పేషీ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తద్వారా రాష్ట్ర కళాసంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు. ఇక ఆద్య కు కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు ఎంతో నచ్చడం తో పవన్ కళ్యాణ్ వాటిని కొనుగోలు చేసి..కూతుర్ని సంతోష పెట్టారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగ్, బొమ్మలు కొని కుమార్తెకు అందించారు.

Read Also : Jani Master Remand Report : నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్