Site icon HashtagU Telugu

Pawan Kalyan : గ‌తి త‌ప్పిన ప‌వ‌న్ భాష‌! చెప్పుతో కొడ‌తా! న‌రికి చంపేస్తా!

Pawan Chappal

Pawan Chappal

జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎనిమిదేళ్లుగా పార్టీని న‌డుపుతున్నారు. మునుపెన్న‌డూ లేని విధంగా మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం నుంచి క్యాడ‌ర్ కు దిశానిర్ధేశం చేస్తూ ఆయన వాడిన భాష ఏపీ రాజ‌కీయాల‌ను ప్ర‌మాద‌క‌ర స్థితికి తీసుకెళ్లాలా వినిపించింది. ఆయ‌న వాడిన భాష జ‌న సైన్యానికి సంతోషం క‌లిగించొచ్చు. కానీ, స‌భ్య స‌మాజాన్ని భ‌య‌కంపితుల్ని చేసేలా ఉంది. రెచ్చ‌గొట్టేలా ఆయ‌న చేసిన ప్ర‌సంగం రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ను అదుపు త‌ప్పేలా చేయ‌నుందని చెప్ప‌క త‌ప్ప‌దు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ భాష గ‌తి త‌ప్పింది. ఆయ‌న మీద వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్యాకేజీ స్టార్ కామెంట్ల‌పై ఆగ్ర‌హించారు. మంగ‌ళ‌గిరి వైసీపీ ఆఫీస్ లో చెప్పు చూపిస్తూ `రండిరా వైసీపీ కొడ‌క‌ల్లారా..వైసీపీ కొడ‌క‌ల్లారా..మెడ పిసికి కొడ‌తా..చేతుల‌తో కొట్టుకుందామా..క‌ర్ర‌ల‌తో కొట్టుకుందామా..రండిరా వైసీపీ కొడ‌క‌ల్లారా. రెచ్చ‌గొడితే న‌రికి చంపేస్తా` అంటూ ప‌రుషప‌ద‌జాలాన్ని ఉప‌యోగిస్తూ క్యాడ‌ర్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

`అరేయ్ నాకు రాజ‌కీయం తెలియద‌నుకుంటున్నార్రా, అరేయ్ మీరు చేసేది క్రిమిన‌ల్ రాజ‌కీయం, నేను చేసేది సిద్ధాంత రాజ‌కీయం. అరేయ్ ఈ రోజు నుంచి యుద్ధానికి రెడీ. రండిరా చూసుకుందాం. వెధ‌వ‌ల్లారా, స‌న్నాసుల్లారా, గుండాల్లారా.రండిరా చూసుకుందాం వైసీపీ ఎమ్మెల్యే గుండాల్లారా. నేను అమెరికా, లండ‌న్ లో పెరిగాన‌నుకుంటున్నారా వెధ‌వ‌ల్లారా. ప‌క్క‌నే ఉండే బాప‌ట్ల‌లో పుట్టినోడ్నిరా, గొడ్డుకారం తిని పెరిగా. చీరాల గోపురం ప‌క్క‌న తిరిగినోడిరా, ఒంగోలు వీధి బ‌డిలో చ‌దివినోడ్ని రా నేను. ప‌బ్లిక్ స్కూల్స్ లో చ‌దివినోడ్ని కాదురా కొడ‌క‌ల్లారా. మీరేనా బూతులు తిట్టిదే. మీకంటే నేను బూతులు బాగా తిడ‌తానురా కొడ‌క‌ల్లారా. చొక్కా ప‌ట్టుకుని లొక్కాచ్చి కొడ‌తా కొడ‌క‌ల్లారా. ఒరేయ్ వెధ‌వ‌ల్లారా వైసీపీ ఎమ్మెల్యే గుండాల్లారా. బూతులు పంచాంగ‌మం తిట్టే ప్ర‌తి కొడుక్కీ నిల్చొబెట్టి తొలు వ‌లుస్తా కొడుకుల్లారా.` ఇలా బూతుల మీద బూతులు తిడుతూ మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ కేంద్రంగా నిర్వ‌హించిన స‌మావేశంలో క్యాడ‌ర్ కేరింత‌ల మ‌ధ్య ప‌వ‌న్ గ‌తి త‌ప్పి మాట్లాడారు.

కొన్ని వంద‌ల సార్లు కొడ‌క‌ల్లారా అంటూ వైసీపీ గూండా ఎమ్మెల్యేల్లారా రండి రా చూసుకుందాం అంటూ పరుష‌ప‌ద‌జాలాన్ని ఉప‌యోగిస్తూ ప‌వ‌న్ చేసిన ప్రసంగం ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో బ్లాక్ స్పాట్ గా ఉంది. ఇవాళ్టి నుంచి వైసీపీతో యుద్ధం ఉంటుంద‌ని ప‌వ‌న్ అన్నారు. గుండెచెప్పుడు తెలంగాణ నుంచి పోరాటం వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు ప‌వ‌న్. మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ‌తానంటూ వైసీపీ ఎమ్మెల్యేల‌కు చెప్పు చూపుతూ ఊగిపోయారు. మూడు పెళ్లిళ్లు కావాలంటే మీరు చేసుకోండ‌ని చెబుతూ మీలాగా ఒక పెళ్లి చేసుకుని 30 మంది స్టెఫ్నీల‌తో తిర‌గ‌నురా కొడ‌క‌ల్లారా అంటూ ప‌రుష‌ప‌ద‌జాలాన్ని వాడుతూ క్యాడ‌ర్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం ఏపీ రాజ‌కీయాల్లో ఇదో ప్ర‌మాద మలుపుగా క‌నిపిస్తోంది.

ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం ఇక నుంచి మారుతుంద‌ని ప‌వ‌న్ తెగేసి చెప్పారు. ఇక నుంచి వైసీపీ గుండాల‌తో యుద్ధం ఉంటుంద‌ని పిలుపు నిచ్చారు. బీజేపీ రోడ్ మ్యాప్ అడిగినంత మాత్ర‌న ఊడిగం చేయ‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. మొత్తం మీద ప‌వ‌న్ ప్ర‌సంగం అంతా బూతుల‌తో, అస‌భ్య ప‌ద‌జాలంతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేశారు.

`అరె నీచుల్లారా. భార‌త‌మ్మ‌ను తిట్టించార‌ని బాధ‌ప‌డుతున్నారు క‌దా. అరె నీచుల్లారా మా అమ్మ అంజ‌నీదేవి ని అనిపించారు క‌ద‌రా వైసీపీ గుండాల్లారా. మీకు నొప్పి గ‌లిగితే తెలిసిందా? ఇక నుంచి చూసుకోండిరా వైసీపీ వెధ‌వ‌ల్లారా, గూండాల్లారా, చూసుకుందాం. ఈ రోజు నుంచి ఒక‌టే వైసీపీ గూండాగాళ్లు ప‌ద్ద‌తిగా మాట్లాడితే ప‌ద్ద‌తే, వాళ్లు రాడ్లు తీస్తే రాడ్లే, వాళ్లు చెప్పుల‌తో వ‌స్తే చెప్పుల‌తో స‌మాధానం. టిబేట్ల‌కు వెళ్లండి వాళ్లు ఏందిరా అంటే ప‌బ్లిక్ గా కొట్టండి` అంటూ క్యాడ‌ర్ కు దిశానిర్దేశం ప‌వ‌న్ చేయ‌డం గ‌మ‌నార్హం.