గత వైసీపీ ప్రభుత్వ (YCP) హయాంలో వైసీపీ నేతలు (YCP Leaders) ఏ రేంజ్లో రెచ్చిపోయారో తెలియంది కాదు..ఇంట్లో ఉన్న ఆడవారిని సైతం వదలకుండా వారిపై బండబూతులు తిట్టారు. ఇప్పుడు అదే వైసీపీ నేతలు నీతులు చెపుతుండడం హాస్యాస్పదంగా ఉంది. తమ ఇంటి ఆడవారిపై కేసులు పెడితే తప్ప..నొప్పి తెలియడం లేదా అని కూటమి శ్రేణులు అంటున్నారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇదే విషయాన్నీ ప్రస్తావించారు. సివిల్ సప్లై గూడెంలో బియ్యం అవకతవకల కేసు నేపథ్యంతో పేర్ని నాని (Perni Nani) సతీమణి జయసుధపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ, పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. జయసుధతో పాటు పేర్ని నాని పీఏలపై కూడా నిందితులుగా కేసులు నమోదయ్యాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో క్వింటాళ్ల కొద్దీ బియ్యం మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, కేసు వివరాలు ఇంకా సరిగ్గా బయటపడడం లేదు. ఇదే క్రమంలో గత కొద్దీ రోజులుగా నాని కుటుంబ సభ్యులు సైతం కనిపించకుండా పోయారు.
రెండు రోజుల క్రితం పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని వాపోయాడు. మచిలీపట్నంలో తన సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోదాము నుంచి బియ్యం షార్టేజీ వచ్చిందనే అంశాన్ని సాకుగా చూపి.. తనతో పాటు తన భార్య, కుమారుడిని కూడా.. అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని ఆయన ఆరోపించారు. బియ్యం షార్టేజీ విషయంలో తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రభుత్వ దర్యాప్తును మించి కూటమి అనుకూల సోషల్ మీడియా అత్యుత్సాహంతో ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘బియ్యం మాయమైంది నిజం. డబ్బులు కట్టింది వాస్తవం. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరు? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా? మేము ఆడవాళ్లను ఈ కేసులో ఇరికించలేదే? పేర్ని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయి. అప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా?’ అంటూ ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని, బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉందని పవన్ డిమాండ్ చేశారు.
Read Also : SpaDeX Mission : ఇవాళ రాత్రి ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’.. జంట శాటిలైట్లతో జబర్దస్త్ ఫీట్