Pawan Kalyan : డిప్యూటీగా సీఎం పవన్ కళ్యాణ్..?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని సదరు ఛానల్‌ ఆదివారం వెల్లడించింది

Published By: HashtagU Telugu Desk
Pawan Dupt

Pawan Dupt

ఏపీ డిప్యూటీగా సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Deputy CM Of Andhra Pradesh) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఈరోజు ఏపీలో కూటమి ఇంత పెద్ద విజయం సాధించిందంటే దానికి కారణం జనసేన అధినేత పవన్ కల్యాణే. అక్రమ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న క్రమంలో ఆయన్ను కలిసి..వెంటనే పొత్తు ప్రకటించడం తోనే ఏపీలో కూటమి విజయం ఖాయమైంది. ఆ తర్వాత పవన్ బిజెపి – టిడిపి ని కలపడం..ఎన్నికల్లో పొత్తుగా ముందుకు వెళ్లడం..తన పార్టీ సీట్లు తగ్గించి టిడిపి – బిజెపి పార్టీలకు త్యాగం చేయడం ఇవన్నీ కూడా ఈరోజు కూటమి విజయానికి కారణాలయ్యాయి. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ప్రధాని మోడీ దగ్గరి నుండి అందరికి గౌరవమే.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ నెల 12 న ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఏపీ డిప్యూటీగా సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ విక్రమ్ చేయబోతున్నారని సమాచారం. తాజాగా ఢిల్లీలో ఓ మీడియా ఛానల్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని సదరు ఛానల్‌ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, ఆయన భార్య అనా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదరు మీడియా ఛానల్‌ రిపోర్టర్‌ పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడారు. రిపోర్టర్‌ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్‌ ఏం మాట్లాడిందీ వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్‌ వ్యాఖ్యానిస్తూ పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్‌ ప్రసారం చేశారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు.

అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని.. ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళతామని కొందరు జనసైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారని కూడా వారు ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ఆయనకు హోంశాఖ ఖాయమంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది రెండు రోజుల్లో తెలుస్తుంది.

Read Also : Health Problems: జీలకర్ర నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  Last Updated: 10 Jun 2024, 12:05 PM IST