Pawan Kalyan: ఢిల్లీ వ్యూహంలో ప‌వ‌న్ ఢ‌మాల్

`చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జ‌రిగింది. ఆయ‌న టైమ్ లోనూ ప్ర‌జాస్వామ్యం లేదు.

  • Written By:
  • Updated On - October 20, 2022 / 03:43 PM IST

`చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జ‌రిగింది. ఆయ‌న టైమ్ లోనూ ప్ర‌జాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలంటూ చంద్ర‌బాబు పిలుపు ఇవ్వ‌డాన్ని బీజేపీ త‌ప్పుబ‌డుతోంది` అంటూ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు తాజా రాజ‌కీయా ప‌రిణామాల‌కు కొత్త భాష్యం చెబుతున్నాయి.

జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయన ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌రువాత చెప్పిన మాట‌ల‌వి. ఢిల్లీకి ప‌వ‌న్ ను బీజేపీ అగ్ర‌నేత‌లు పిలిచార‌ని బుధ‌వారం మీడియా హ‌ల్ చ‌ల్ చేసింది. ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌ను క‌లుస్తార‌ని జన‌సేన లీకులు ఇచ్చింది. సీన్ క‌ట్ చేస్తే, ఢిల్లీ వెళ్లిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌ర్నీ క‌లిసిన దాఖ‌లాలు లేవు. కేవ‌లం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో మాత్ర‌మే భేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Also Read:  TDP vs YCP : బాబాయ్ హ‌త్య కేసులో నైతిక భాధ్య‌త వ‌హిస్తూ జ‌గ‌న్ రాజీనామా చేయాలి – మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌

మూడేళ్లుగా బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ఏపీలో ప‌నిచేస్తున్నాయి. కానీ, ఉప ఎన్నిక‌ల్లోనూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డిపోరాటం చేసిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన‌ప్ప‌టికీ డిపాజిట్లు ద‌క్క‌లేదు. ఆ త‌రువాత జ‌రిగిన బ‌ద్వేల్, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు వేర్వేరుగా వ్య‌వ‌హ‌రించాయి. ఎనిమిదో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా మూడు ఆప్ష‌న్లు త‌న‌కు ఉన్నాయ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఆ త‌రువాత నాలుగో ఆప్ష‌న్ కూడా ఉందంటూ ప్ర‌చారం జ‌రిగింది.

బ‌హుశా నాలుగో ఆప్ష‌న్ కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ తో క‌లిసి ప‌నిచేయ‌డం అంటూ ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌ట్లో ఆయ‌న చెప్పిన మూడు ఆప్ష‌న్ల‌లో ఒక‌టి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్ల‌డం ఒక‌టి. రెండోవ‌ది బీజేపీ, జ‌న‌సేన పొత్తుతో వెళ్ల‌డం. ఇక మూడో ఆప్ష‌న్ టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం. నాలుగో ఆప్ష‌న్ కింద ఒంటరిగా జ‌న‌సేన వెళ్ల‌డమ‌ని అప్ప‌ట్లో అనుకున్నారు. కానీ, తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కావ‌డంతో ఆ పార్టీతో జ‌న‌సేన వెళుతుంద‌ని తాజా టాక్‌.

Also Read:  Rahul Gandhi Yatra: యూపీఏలో వైసీపీపై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు

విశాఖ ఘ‌ట‌న త‌రువాత ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయ చిత్రం మారిపోయింది. గ‌ర్జ‌న సంద‌ర్భంగా విశాఖ వెళ్లిన ప‌వ‌న్ ను హోట‌ల్ లో నిర్బంధించారు. దీంతో రెచ్చిపోయిన ఆయ‌న మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ కేంద్రంగా బూతులు తిడుతూ వైసీపీ లీడ‌ర్ల‌పై ద‌మ్మెత్తిపోశారు.అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లయిక చోటుచేసుకుంది. దీంతో టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖ‌య‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, బీజేపీతో క‌టీఫ్ అయిన‌ట్టు ప‌వ‌న్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయ‌న్ను ఢిల్లీకి బీజేపీ పెద్ద‌లు ఆహ్వానించారు.

ప్ర‌స్తుతం ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పెద్ద‌ల‌తో. ప‌వ‌న్ మంత‌నాలు సాగిస్తున్నారు. రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూసిన. ప‌వ‌న్ ఇక ఊడిగం చేయ‌లేనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ పెద్ద‌లు జ‌న‌సేనాని తో భ‌విష్య‌త్ రాజ‌కీయం గురించి ప్ర‌స్తావిస్తార‌ని తెలుస్తోంది. అయితే, జ‌న‌సేన‌, టీడీపీ మాత్రమే క‌లిసి వెళ్లేలా ఢిల్లీ మ్యాప్ ఉంద‌ని తెలుస్తోంది. దానికి ప‌వ‌న్ అంగీకరిస్తారా? లేదా అనేది చూడాలి.

Also Read:   Botsa : పవన్ ను చూస్తే రక్తం మరుగుతోంది..!!