Site icon HashtagU Telugu

Pawan’s Dept Sets A World Record : ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ శాఖ

Pawan Kalyan Creates New Wo

Pawan Kalyan Creates New Wo

Pawan’s Dept Sets A World Record : సినిమాల్లోనే (Movies) కాదు పాలనా లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). తాజాగా తాను తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు (World Record) సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణను (Gram Sabhas in 13,326 Villages in a Single Day) వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ రికార్డుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్ ను ఆయనకు ప్రతినిధులు అందించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా కానీ అధికారం అనేది దక్కలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సహం చెందకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చాడు. తాను సంపాదించిందంతా ప్రజలకే ఇస్తూ..అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తో పొత్తు పెట్టుకొని సంచలన విజయం సాధించారు. జనసేన నుండి బరిలోకి దిగిన 21 ఎమ్మెల్యేలు , 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకోవడమే ఆలస్యం తనదైన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ కనపరుస్తూ వస్తున్నారు.

ఇక పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్‌కు ఎక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకే రోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించటాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పత్రాన్ని, పతకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పవన్‌ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ భేటీ అయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున ఇన్ని సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.

Read Also :  Shanmukh Jaswanth : హీరోగా మారుతున్న షన్ను.. వెండితెరపై మెప్పిస్తాడా..?