Site icon HashtagU Telugu

Pawan Kalyan: హరీష్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కౌంటర్…

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ మంత్రి హరీష్ రావు – ఆంధ్రప్రదేశ్ మంత్రుల మధ్య డైలాగ్ వార్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులు ప్రజలను మధ్యలోకి లాగొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైజాగ్ స్టీల్ పై బిడ్డింగ్ విషయంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హరీష్ రావు ఏపీ అభివృద్ధిపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు మాటల యుద్దానికి దిగారు. ఇలా తెలంగాణ మంత్రి హరీష్ – ఏపీ మంత్రుల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఇదే ఇష్యూపై జనసేన చీఫ్ ఘాటుగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…పాలకులు వేరు ప్రజలు వేరు. అనవసరంగా మీ రాజకీయాల కోసం ప్రజలను మధ్యలోకి లాగొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేసారో తెలియదు గానీ ..హరీష్ రావు మాటలు బాధ కలిగిస్తే ఏపీ నేతలు వ్యక్తిగతంగానే మాట్లాడాలని..తెలంగాణ ప్రజలను తిట్టటం.. తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదన్నారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలపై దెబ్బకొట్టినట్టే అంటూ అసహనం వ్యక్తం చేశారు. పాలకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదన్నారు.

వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. తెలంగాణ ప్రజల్ని, ప్రాంతాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం తనకు మనస్తాపం కలిగించిందని చెప్పారు పవన్. వైసీపీ మంత్రుల కామెంట్స్ పై సీఎం జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు పవన్. ఏపీలోని మంత్రులకు, నాయకులకు తెలంగాణాలో వ్యాపారాలు లేవా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీనేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రులు తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని పవన్‌ కళ్యాణ్ డిమాండ్‌ చేశారు.

Read More: Uric Acid : యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మామిడిపండ్లు తినాలా వద్దా? నిపుణలు ఏం చెబుతున్నారు.