Site icon HashtagU Telugu

Pawan : రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan appointed coordinator for two parliamentary constituencies

Pawan Kalyan: జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్ ఈరోజు పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం(Amalapuram), విజయవాడ(Vijayawada) పార్లమెంటు స్థానాల( Parliament Seats) పరిధిలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల సమన్వయకర్తలను(Coordinator) నియమించారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayadu), విజయవాడ పార్లమెంటు స్థానానికి అమ్మిశెట్టి వాసు(Ammisetti Vasu)లను సమన్వయకర్తలుగా నియమించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో వీరు మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తారని, మిత్ర పక్షాల అభ్యర్థుల విజయం కోసం పాటుపడతారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన కూటమి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఇది డొక్కా సీతమ్మ పుట్టిన నేల, అలంకార, తర్క శాస్త్ర పండితుడు జగన్నాథ పండిత రాయలు పుట్టిన నేల అని అభివర్ణించారు. ప్రసంగం ప్రారంభించడానికి ముందు… ముస్లిం సోదరసోదరీమణులందరికీ కూటమి తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. సామాజిక న్యాయ కోసం పాటుపడిన కృషీవలుడు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా చెబుతున్నాను… బీసీలకు న్యాయం చేసేది ఎన్డీయే కూటమి మాత్రమే అంటూ స్పష్టం చేశారు.

Read Also:Medicines:మార్కెట్లో మెడికల్ మాఫియా.. డూప్లికేట్ మందులతో జర జాగ్రత్త

“కోనసీమ… ఇది కలహాల సీమ కాదు… ప్రేమ సీమ. కొబ్బరి నీళ్లు ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనసున్న కోనసీమను జగన్ వచ్చి కలహాల సీమగా మార్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ ప్రయత్నాన్ని మేం అడ్డుకున్నాం. రెండున్నర లక్షల హెక్టార్లలో కొబ్బరితోటలతో నిండిన ఈ అందాలసీమను తిరిగి ప్రేమ సీమగా మార్చుకునేందుకు శాయశక్తులా కృషి చేశాం.

Read Also:Chandrababu : చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు జగన్ – చంద్రబాబు

భవిష్యత్తులోనూ అన్ని కులాల మధ్య సఖ్యత ఉండాలని కోరుకుంటున్నాం… శెట్టిబలిజలు, కాపులు, మాలలు, మాదిగలు, క్షత్రియులు, వాడబలిజలు, మత్స్యకారులు, బీసీల్లో సంఖ్యాబలం లేని 127 కులాలు, ముస్లింలు… అందరూ అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది.. అన్నారు.