ఏపీ(AP)లో ఎన్నికల పోలింగ్ (Elections) కు సరిగ్గా 32 రోజులు మాత్రమే ఉంది. అధికార పార్టీ వైసీపీ (YCP) ఐన..ప్రతిపక్ష పార్టీలైన ఏంచేసినా ఈ 32 రోజుల్లోనే చేయాలి…ఆ తర్వాత ప్రజలు తమ నిర్ణయాన్ని ఓటు రూపంలో గుద్దేస్తారు. అందుకే ఈ నెల రోజుల్లో గట్టిగా ప్రజల్లోకి వెళ్లాలని అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడం స్టార్ట్ చేసారు. వైసీపీ అధినేత సిద్ధం అంటే..చంద్రబాబు ప్రజాగళం అని , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర పేరుతో ప్రజల్లోకి నిలుస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక జనసేన విషయానికి వస్తే పార్టీ ప్రకటించి పవన్ కళ్యాణ్ పదేళ్లు పూర్తి అవుతున్న ఇంతవరకు ఎమ్మెల్యే గా గెలువలేకపోయాడు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ రెండో చోట్ల ఓటమి చెందారు. అలాగే సింగిల్ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. పిఠాపురం నుండి బరిలోకి దిగిన పవన్..ఈ ఎన్నికల్లో మొత్తం 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇదే తరుణంలో ఎన్నికల ప్రచారం కోసం స్టార్ ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల నురంగంలోకి దింపబోతున్నారు. ఈ మేరకు జనసేన కోసం ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపెయినర్ల (Janasena Campaigners) ను ప్రకటించాడు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, అంబటి రాయుడు (క్రికెటర్), కొరియోగ్రాఫర్ జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినట్లు జనసేన పార్టీ తన అధికార సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది.
జనసేన ప్రకటించిన ఈ క్యాంపెయినర్ల ఫై వైసీపీ పార్టీ తనదైన శైలి లో సెటైర్లు వేసింది. ‘మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ జనసేన పార్టీకి అంత కామెడీ అయిపోయాయి. ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్ షీట్లు చూసుకోండి’ అని ట్వీట్ చేసింది. దీనిపై జనసేన శ్రేణులు, సినీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Cardiophobia: గుండెపోటు వస్తుందని ఎప్పుడూ భయపడుతున్నారా.? మీకు కార్డియోఫోబియా కావచ్చు..!