Pawan Kalyan : రూ. 6 కోట్ల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా..ఎవరు ఆపద లో ఉన్న తన వంతు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు

Published By: HashtagU Telugu Desk
Pawan6cr

Pawan6cr

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా..ఎవరు ఆపద లో ఉన్న తన వంతు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. తన దృష్టికి ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు క్షణం ఆలోచించకుండా సాయం చేస్తుంటారు. ఇప్పటివరకు వందలకోట్లు సాయం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కోసం తన వంతు సాయం ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ, తెలంగాణ లో భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల వల్ల రెండు రాష్ట్రాలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో దాతలు సాయం చేయాలంటూ ఇరు సీఎంలు కోరారు. దీంతో ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. చిత్రసీమ నుండి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు ప్రకటిస్తుండగా..ఇటు రాజకీయ నేతలు , బిజినెస్ ప్రముఖులు , ఇతర రంగాల వారు సైతం తమకు తోచిన సాయాన్ని అందజేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇప్ప‌టికే వ‌ర‌ద బాదితుల కోసం కోటి విరాళం ప్ర‌క‌టించిన ఆయ‌న తాజాగా మ‌రో అయిదు కోట్లు విరాళం ఇస్తునట్లు చెప్పారు.. ఈ వాన‌లు, వ‌ర‌ద‌లో ఎపిలో మొత్తం నాలుగు వందల గ్రామాలు దెబ్బ‌తిన్నాయ‌ని, ఆయా గ్రామాల‌ను ఆదుకోవ‌ల‌సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని నేడు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.. త‌న వంతు సాయంగా ఒక్కోగ్రామానికి ల‌క్ష రూపాయ‌లు చొప్పున ఆయ గ్రామ పంచాయితీల‌కు పంప‌నున్న‌ట్లు చెప్పారు.. అలాగే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా మరో కోటి రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పవన్ మొత్తం ఆరు కోట్లు విరాళం ఇచ్చినట్లైంది.

Read Also : Odisha MTS Exam: ప్రభుత్వ పరీక్ష పత్రంలో స్టార్ క్రికెటర్ల పేర్లు, ఆన్సర్ ఏంటి?

  Last Updated: 05 Sep 2024, 01:14 PM IST