BJP Janasena: చంద్ర‌బాబును పాపాల భైర‌వునిగా మార్చేస్తోన్న వైసీపీ

`మంచికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెడుకు చంద్ర‌బాబు` మాదిరిగా ఏపీ రాజ‌కీయం మారింది. ప్ర‌తిదానికి చంద్ర‌బాబును ఆడిపోసుకుంటూ పాపాల భైర‌వునిగా ఆయ‌న్ను మార్చ‌డానికి వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది.

  • Written By:
  • Updated On - November 5, 2022 / 02:25 PM IST

`మంచికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెడుకు చంద్ర‌బాబు` మాదిరిగా ఏపీ రాజ‌కీయం మారింది. ప్ర‌తిదానికి చంద్ర‌బాబును ఆడిపోసుకుంటూ పాపాల భైర‌వునిగా ఆయ‌న్ను మార్చ‌డానికి వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా త‌న‌కు తానే రాళ్లు వేసుకున్నార‌ని చంద్ర‌బాబు మీద ఎదురుదాడిని మంత్రులు మొదలుపెట్టారు. మొన్న‌టికి మొన్న ప‌వ‌న్ హ‌త్య‌కు చంద్ర‌బాబు కుట్ర చేశాడ‌ని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లిన చంద్ర‌బాబు కు అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ప్ర‌తి జిల్లాలో `బాదుడేబాదుడు` కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రువుతున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పెంచిన ధ‌ర‌లు, ప్ర‌జా వ్య‌తిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. ఆ సంద‌ర్భంగా ఇటీవ‌ల ఆయ‌న ఏ జిల్లాకు వెళ్లిన‌ప్ప‌టికీ అనూహ్యంగా జ‌నం త‌ర‌లి వ‌స్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోనూ పెద్ద ఎత్తున జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఆ సంద‌ర్భంగా ఎవ‌రో గుర్తు తెలియ‌న వ్య‌క్తి రాయి విసిరారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో విద్యుత్ కూడా పోవ‌డాన్ని గ‌మ‌నిస్తే ప్లీ ప్లాన్డ్ గా దాడి చేశార‌ని అర్థం అవుతోంది.

Also Read:  Pawan Kalyan: `ఇప్ప‌టం` విడిచి సాము చేస్తోన్న ప‌వ‌న్

రాళ్ల దాడికి చంద్ర‌బాబు సెక్యూరిటీ అధికారి గాయ‌ప‌డ్డారు. ఇదంతా చంద్ర‌బాబు వేసిన ఎత్తుగ‌డ‌గా వైసీపీ చెప్ప‌డం శోచ‌నీయం. ఎందుకంటే, ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంటుంది. ఒక వేళ చంద్ర‌బాబు త‌న‌కు తానుగా రాళ్ల దాడి చేయించుకుంటే నిరూపించాల్సిన బాధ్య‌త కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద ఉంటుంది. అందుకు భిన్నంగా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేయ‌డం దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నంగా ఉంద‌ని టీడీపీ నిల‌దీస్తోంది. ప్రజాదరణను చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. దొంగదెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని, నందిగామలో కరెంట్ తీయించి రాళ్లు వేయించారని చెబుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడినే భయపెట్టాలనుకోవడం దారుణమని ప్రజాస్వామ్యంలో ప్రమాదకర సంకేతమని అన్నారు.

కరెంటు తీయించి, రాళ్లు వేయించడాన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు జగన్ ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుందని టీడీపీ చెబుతోంది. ఇలాంటి పిచ్చి పనులను మానుకోవాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ పార్టీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌తిగా రోడ్ షోపై గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన రాయి ఘటనపై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. రోడ్ షోపై పడ్డ రాయిని చంద్రబాబే విసిరించుకున్నారని ఆరోపించారు. ఈ దాడిలో భద్రతా అధికారి గాయపడటం బాధాకరమన్నారు. దాడిలో గాయపడిన అధికారికి క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు అంటూ కొత్త లాజిక్ తీశారు.

Also Read:  Pawan Kalyan visit Ippatam: ‘ఇప్పటం’ కోసం రక్తం చిందించడానికైనా సిద్ధం!

గ‌తంలోనూ మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా విశాఖ వెళ్లినప్పుడు చంద్ర‌బాబు మీద కోడిగుడ్లు, రాళ్లను విసిరారు. అదంతా వైసీపీ నాయ‌కులు చేయించిన ప‌నిగా టీడీపీ భావించింది. ఆయ‌న జోలె ప‌ట్టేందుకు వెళ్లిన సంద‌ర్భంగా ఎయిర్ పోర్టు లోనే ఆయ‌న్ను ఉంచారు. బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా వెన‌క్కు పంపించేశారు. ఆ సంద‌ర్భంగా కొంద‌రు చంద్ర‌బాబు కాన్వాయ్ మీద రాళ్లు, గుడ్ల‌తో దాడికి ప్ర‌య‌త్నం చేశారు. ఆనాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్ష నేత‌కు భ‌ద్ర‌త అనేది ఎండ‌మావిగా మారింది. అందుకే, ఇటీవ‌ల ఆయ‌న‌కున్న జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీలోని క‌మాండోల సంఖ్య‌ల‌ను కేంద్రం పెంచింది.