Pawan Kalyan : జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు

అనకాపల్లి బెల్లానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ఉందని ..గతంలో తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం ఉపయోగించారు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రసాదంలో ఈ బెల్లం వాడటం మానేసింది. కానీ ఇప్పుడు అనకాపల్లి అనగానే కోడిగుడ్డును వింటున్నాం.

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 09:47 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. పిఠాపురం పర్యటనలో జ్వరం రావడం తో రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్..నేడు తన ప్రచారాన్ని స్టార్ట్ చేసారు. ఆదివారం నాడు అనకాపల్లి (Anakapalle) జిల్లాలోని నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ‘వారాహి విజయభేరి’ భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

ఈ సందర్బంగా జగన్ సర్కార్ ఫై అలాగే వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌(Gudivada Amarnath)పై సెటైర్లు గుప్పించారు. అనకాపల్లి బెల్లానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ఉందని ..గతంలో తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం ఉపయోగించారు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రసాదంలో ఈ బెల్లం వాడటం మానేసింది. కానీ ఇప్పుడు అనకాపల్లి అనగానే కోడిగుడ్డును వింటున్నాం. కోడిగుడ్డు పెట్టింది… గుడ్డు పొదుగుతోందని వైసీపీ నేతలు కబుర్లు చెబుతున్నారు. వైసీపీ కోడి ఇక డిప్యూటీ సీఎంను, మంత్రిని, విప్‌ను ఇచ్చినా అనకాపల్లిలో ఒక కిలో మీటర్ రోడ్డు కూడా వేయలేక పోయారు’’ అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రసాదానికి అనకాపల్లి బెల్లం ఉపయోగించేలా, గ్లోబల్ ట్యాగ్ వచ్చేలా చేస్తాం. శారదా నదిపై మినీ ప్రాజెక్టులు, కాల్వలకు మరమ్మతులు చేసి ప్రతి పొలానికి నీళ్లు ఇస్తాం’ అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్‌ ఒక సీఎం కాదు.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారు అని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తాను మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేదని.. కాకపోతే తనకు పదవులు ముఖ్యం కాదని.. రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్దకాలం పాటు పార్టీని నడపడం అంత సులభం కాదు.. అయినా సరే, మీ భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నా అని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అశేష ప్రజాభిమానం ఉందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అయితే ఇంతటి ప్రజాభిమానాన్ని తమ పార్టీకే సొంతం చేసుకోవాలన్న స్వార్థం ఉంటుంది కానీ.. దాన్ని దాటి జనం కోసం వచ్చానని చెప్పారు. కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదని.. అన్ని శక్తులు ఏకం కావాలని అన్నారు. అందుకే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకున్నామని వివరించారు.

అలాగే తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ‘నేను సాధారణ ఉద్యోగి కుమారుడిని. ఉద్యోగులకు పెన్షన్ ఎంత ముఖ్య మో నాకు తెలుసు. NDA ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే న్యాయం చేస్తాం. అనకాపల్లి SEZలో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తాం. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించారు.

Read Also : Aarti Chabria: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల కిందటే అమ్మా అయ్యానంటూ!