Site icon HashtagU Telugu

Pawan kalyan : జ‌న‌సేనలో ప్ర‌జారాజ్యం! నాగ‌బాబు`మెగా`రోల్

Pawan Kalyan

Pawan Kalyan

జ‌న‌సేన మ‌రో ప్ర‌జారాజ్యం(Pawan kalyan) కాబోతుందా? ఆ పార్టీలో మెగా కుటుంబానికి మాత్ర‌మే ప్రాధాన్య‌మా? నాగ‌బాబుకు(Nagababu) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఇవ్వ‌డం పార్టీ మేలా? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా జ‌న‌సేన మారింది. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఫ్యామిలీ ప్యాక్ లా ఉండేది. అధ్య‌క్షుడు చిరంజీవి నుంచి అల్లు అర‌వింద్, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మెగా హీరోలు అంద‌రూ ప్ర‌జారాజ్యం తెర‌మీద క‌నిపించారు. అలాంటి ప‌రిస్థితి రాకుండా జాగ్ర‌త్త ప‌డుతూ వ‌చ్చిన ప‌వ‌న్ తాజాగా ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

జ‌న‌సేన మ‌రో ప్ర‌జారాజ్యం కాబోతుందా?(Pawan kalyan) 

జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని నాగబాబుకు(Nagababu) అప్ప‌గించారు. అంతేకాదు, ఎన్నారై జ‌నసేన విభాగాల‌ను ఆయ‌న‌కు అనుసంధానం చేశారు. ఇక స్వ‌దేశీ, విదేశీ పార్టీ వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న మాత్ర‌మే చూసుకుంటారు. ప్ర‌స్తుతం ఆయ‌న జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యునిగా ప‌నిచేస్తున్నారు. అద‌నంగా ఆయ‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వితో పాటు ఎన్నారై విభాగాల‌ను ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం ఎంపీగా పోటీచేసి ఆయ‌న ఓడిపోయారు. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డిన‌ప్పుడు జ‌న‌సేన పార్టీలో కీల‌క భూమిక పోషించారు. అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు. వెంట‌నే బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్టీని(Pawan kalyan) ఇప్ప‌టి వ‌ర‌కు బ‌తికించుకుంటూ వ‌చ్చారు.

ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నాగ‌బాబు

ప‌దేళ్ల జ‌న‌సేన జ‌ర్నీ అంతా సినిమా షూటింగ్ ల మాదిరిగా జ‌రిగింది. ఎప్పుడు ప్యాక‌ప్ అవుతుందో తెలియ‌కుండా నెట్టుకొచ్చింది. వ్యూహాత్మ‌కంగా ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌కుండా పార్టీని నిలిపారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఏక‌వ్య‌క్తి ప‌వ‌న్(Pawan kalyan) ప్ర‌క‌టించిన పార్టీ జ‌న‌సేన‌. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీకి అడ‌గ‌కుండానే మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత ప‌వ‌న్ మ‌ద్ధ‌తుతో మాత్ర‌మే చంద్ర‌బాబు సీఎం అయ్యాడ‌ని ప్ర‌చారం చేశారు. ప్ర‌ధానిగా మోడీ కావడంలోనూ ప‌వ‌న్ భాగ‌స్వామ్యం ఉంద‌ని ఫోక‌స్ ఇచ్చుకున్నారు. ష‌డ‌న్ గా 2019 ఎన్నిక‌ల‌కు ముందు క‌మ్యూనిస్ట్‌, బీఎస్పీ పార్టీల‌తో పొత్తు పెట్టుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు చెప్పిన జేగువీరా సిద్ధాంతానికి కాన్షీరాంను జోడించి ఆ ఎన్నిక‌ల‌కు వెళ్లారు. సీన్ కట్ చేస్తే,ప‌వ‌న్ రెండు చోట్ల ఓడిపోగా, ప‌లు చోట్ల‌ డిపాజిట్లు రాలేదు.

Also Read : Pawan Kalyan : వైసీపీ రహిత ఏపీ ల‌క్ష్యంగా బీజేపీ, జ‌న‌సేన ప‌నిచేస్తాయి – జ‌న‌సేనాని ప‌వ‌న్‌

ఆ ఎన్నిక‌ల త‌రువాత ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని వెంట‌నే మోడీ ప‌క్షాన జ‌న‌సేన‌ను చేర్చారు. హిందువుల‌కు, హిందూవాదానికి అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్(Pawan kalyan). అప్ప‌టి నుంచి ఢిల్లీ బీజేపీతో పొత్తు అంటూ చెబుతూ జన‌సేన పార్టీని బ‌తికించారు. ప్ర‌జారాజ్యం పార్టీ పోక‌డ‌కు భిన్నంగా జ‌న‌సేన పార్టీని న‌డుపుకుంటూ వ‌చ్చారు. రాజ‌కీయ ఈక్వేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అనుకూలంగా ప‌వ‌న్ మ‌లుచుకున్నారు. కానీ, ప్ర‌జారాజ్యం పార్టీలో మాదిరిగా మెగా ఫ్యామిలీ, కాపు సామాజిక‌వ‌ర్గంతో నిండే దిశ‌గా అడుగులు ప‌డ్డాయి. ఇప్ప‌టికే రాష్ట్ర కార్య‌వర్గంలో 80శాతం ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఉన్నార‌ని ఆ పార్టీలోని చ‌ర్చ‌. ఇక అనుబంధ విభాగాల్లోనూ ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇప్పుడు నాగబాబును(Nagababu) కీ రోల్ పోషించ‌డానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ఎన్నిక‌ల నాటికి మెగా హీరోలు మ‌రింత మంది జ‌మయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే, మ‌రో ప్రజారాజ్యంలాగా జ‌న‌సేన మారుతుంద‌ని టాక్ మొద‌ల‌యింది.

Also Read : BJP bye to Janasena?: జై చంద్రబాబు, పవన్ ఆప్షన్ అదే.! జనసేనకు బీజేపీ బై?