Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న పవన్

Tirupati Stampede Incident : గురువారం విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, నేరుగా బైరాగిపట్టెడలోని ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Visits Stumped

Pawan Kalyan Visits Stumped

తిరుపతిలోని పద్మావతి పార్కు (Padmavathi Park) వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట ఘటన (Tirupati Stampede Incident) పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, నేరుగా బైరాగిపట్టెడలోని ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరుపై అక్కడి అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, డీఎస్పీ చెంచుబాబుతో మాట్లాడుతూ, భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి చర్యలు తీసుకోకపోవడం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదని అభిప్రాయపడ్డారు.

పవన్ కల్యాణ్ ఈ ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ భక్తుల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తుల ప్రాణాలు విలువైనవి అని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటానని, బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనతో భక్తుల భద్రత పట్ల మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా టోకెన్ జారీ ప్రక్రియను మెరుగుపరచాలని, రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాల్లో భక్తులకు ఇలాంటి అనుభవాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read Also : Ravula Sridhar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

  Last Updated: 09 Jan 2025, 06:18 PM IST