Pawan Game change : చంద్ర‌బాబు పాల‌న‌పై ప‌వ‌న్ వ్య‌తిరేక‌గ‌ళం, పొత్తు లేన‌ట్టే!

జనసేనాని ప‌వ‌న్ రాజ‌కీయ (Pawan Game change) స్వ‌రం మారుతోంది. తొలి రోజుల్లో సీఎం ప‌ద‌వి రేస్ లో లేనంటూ వెల్ల‌డించారు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 03:07 PM IST

జనసేనాని ప‌వ‌న్ రాజ‌కీయ (Pawan Game change) స్వ‌రం మారుతోంది. తొలి రోజుల్లో సీఎం ప‌ద‌వి రేస్ లో లేనంటూ వెల్ల‌డించారు. ఆ త‌రువాత సీఎం ప‌ద‌వి ఇస్తే సంతోషంగా తీసుకుంటాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చూడ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. అందుకే, చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తు ఇస్తున్నారిన అంద‌రూ భావించారు. కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌ల్లంపాడు నిర్వాసితుల‌కు అన్యాయం చేసింద‌ని తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ప‌వ‌న్ తీరును అనుమానించేలా చేస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌ల్లంపాడు నిర్వాసితుల‌కు అన్యాయం చేసింద‌ని(Pawan Game change)

ప్ర‌జారాజ్యం పార్టీ విలీనం త‌రువాత జ‌న‌సేన పార్టీని ప‌దేళ్ల క్రితం జ‌నసేన ఆవిర్భవించింది. ఆ రోజే ప్ర‌జారాజ్యం 2.0గా ప్ర‌త్య‌ర్థులు అంచ‌నా వేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ న‌డుపుతూ ప‌వ‌న్ చాక‌చ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. పార్టీ పెట్టిన తొలి రోజుల్లో బీజేపీ, టీడీపీకి మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆ రోజుకు పార్టీ నిర్మాణం ఎక్క‌డా లేదు. కానీ, జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం కార‌ణంగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎన్డీయే ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ్డాయ‌ని ఫోక‌స్ అయ్యారు. క్ర‌మంగా ఆనాడున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌ద్ధ‌తులో పార్టీని (Pawan Game change) బ‌లోపేతం చేసుకున్నారు. తీరా, 2019 ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు హ్యాండిచ్చారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిందంటూ కొత్త ఈక్వేష‌న్ బ‌య‌ట‌కు తీశారు.

కూట‌మి ప్ర‌స్త‌క్తి ఉండ‌ద‌ని తాజాగా ప‌వ‌న్ చేసిన కామెంట్ల ఆధారంగా

జ‌న‌సేన పార్టీని బ‌తికించుకోవ‌డానికి బీజేపీ ఆహ్వానించ‌న‌ప్ప‌టికీ ఢిల్లీ వెళ్లి క‌షాయ కండువా కింద‌కు దూరారు. హిందూమ‌తానికి అన్యాయం జ‌రిగితే ఊరుకోనంటూ హూంక‌రించారు. అప్ప‌టి వ‌ర‌కు వినిపించిన చేగువీరా, కాన్షీరాం, చాక‌లి ఐల‌మ్మ‌, లెనిన్, మార్కిజం ఒక్క‌సారి వ‌దిలేశారు. లెఫ్ట్ నుంచి రైట్ కు మ‌ళ్లారు. ఆ రోజు ఢిల్లీ బీజేపీ తో స‌ఖ్య‌త‌గా ఉన్నప్ప‌టికీ జ‌న‌సేన విలీనం మాట అప్పుడ‌ప్పుడు వ‌స్తుండేది. ఒక జాతీయ పార్టీ విలీనం కోసం ఒత్తిడి తెస్తుంద‌ని క్యాడ‌ర్ కు లీకులు ఇచ్చారు. ప్ర‌తిస్పంద‌న సానుకూలంగా రాక‌పోవ‌డంతో నెల‌కు, రెండు నెల‌ల‌కు ఒక‌సారి సినిమా షెడ్యూల్ లేని స‌మ‌యంలో ఏపీకి వెళ్లి రావ‌డం మొద‌లు పెట్టారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు టీడీపీ దూరంగా ఉండ‌డంతో జ‌న‌సేన  (Pawan Game change)బ‌ల‌ప‌డిన‌ట్టు ఫోక‌స్ ఇచ్చారు.

Also Read : Pawan Russia File:ర‌ష్యా ఫైల్`బ్రో`!ఢిల్లీలో అంబ‌`ఢీ`!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏ ముహూర్తాన వ‌న్ సైడ్ ల‌వ్ అంటూ పొత్తుల గురించి ప్ర‌స్తావించారో, ఆ రోజు నుంచి జ‌న‌సేన గురించి సీరియ‌స్ గా మాట్లాడుకోవ‌డం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో మొద‌లైయింది. దానికి త‌గిన విధంగా వ్యూహాత్మంగా వైసీపీ కూడా ప‌వ‌న్ ను హైలెట్ చేసేలా వ్య‌వ‌హారం న‌డిపింది. ఇటీవ‌ల వ‌ర‌కు టీడీపీతో పొత్తు ఖాయ‌మంటూ జ‌నసేన లీకులు ఇచ్చింది. అంతేకాదు, బీజేపీని కూడా క‌లుపుకుని కూట‌మి అంటూ ప‌వ‌న్ చెప్పారు. కానీ, వారాహి యాత్ర ప్రారంభించిన త‌రువాత వ‌స్తోన్న అభిమానుల‌ను చూసి తొలుత సీఎం ప‌ద‌విపై ఆశ పుట్టింది. ఆ త‌రువాత ఇప్పుడు చంద్ర‌బాబు పాల‌న మీద విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ద్వారా సొంత‌గా వెళ్లాల‌ని ధైర్యం చేస్తున్నారు. బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్ర‌కారం ఏపీ రాజ‌కీయాలు వెళ్ల‌డంలేద‌ని చంద్ర‌బాబు మీద ప‌వ‌న్ చేసిన తాజా కామెంట్ల‌తో అర్థ‌మ‌వుతోంది.

Also Read : Janasena : మల్లవల్లి రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ

రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం దిశ‌గా జ‌న‌సేన అడుగులు ప‌డుతున్నాయ‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. గ‌త రెండు నెల‌లుగా వైసీపీ ఆడిన గేమ్ స‌క్సెస్ అయ్యే దిశ‌గా ప‌వ‌న్ అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ వేస్తోన్న అడుగుల‌కు అనుగుణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా న‌డుస్తున్నారు. ఫ‌లితంగా కూట‌మి ప్ర‌స్త‌క్తి ఉండ‌ద‌ని తాజాగా ప‌వ‌న్ చేసిన కామెంట్ల ఆధారంగా అర్థ‌మ‌వుతోంది. బీజేపీతో క‌లిసి ప‌వ‌న్ వెళ్లాల్సిన అనివార్య ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. అదే జ‌రిగితే, తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆ రెండు పార్టీల‌కు రాష్ట్ర వ్యాప్తంగా క‌నిపిస్తాయ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని టాక్‌.