Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు – నాదెండ్ల మనోహర్

Manohar Clarty

Manohar Clarty

కర్ణాటక పర్యటన (Karnataka Tour) లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)…’40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్​ చేస్తున్నాడు’ అని అనడం ఫై అల్లు అర్జున్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పవన్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు. పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ప్రత్యేక కార్యాచరణతోనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు’’ అంతే తప్ప ఓ హీరోపై పరోక్షంగా కామెంట్స్ చేసారని ప్రచారం చేయడం తప్పు..కావాలని కొంతమంది పవన్ వ్యాఖ్యలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కాకుండా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడాన్ని పవన్ అభిమానులే కాదు ఇండస్ట్రీ లోని కొంతమంది పెద్దలు కూడా తప్పు పట్టారు. అప్పటి నుండి ఇరు అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. పలు ఈవెంట్ లలో మీడియా సైతం అల్లు అర్జున్ – పవన్ ల మధ్య కోల్డ్ వార్ గురించి చిరంజీవి ఫ్యామిలీ సభ్యులను ప్రశ్నించడం జరిగింది. దానికి అలాంటిది ఏమి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం కావాలనే పవన్ – బన్నీ ల మధ్య వార్ పెంచుతున్నారు.

పవన్ కర్ణాటక పర్యటన విషయానికి వస్తే..

కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కర్ణాటక సీఎం ను పవన్​ కోరడం జరిగింది. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని పవన్ తెలిపారు. ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని, అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని , కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read Also :  Chaitu : ఫస్ట్ వైఫ్ ప్రపోజ్ చేసిన రోజే..సెకండ్ వైఫ్ తో ఎంగేజ్మెంట్..చైతు ఏమన్నా రివెంజా..!!