Pawan Interview: తిరుమల లడ్డూ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల తర్వాత ఈ విషయం దేశంలోని రాజకీయ ప్రముఖులతో పాటు సెలెబ్రిటీలకు సైతం తగిలింది. లడ్డూ వ్యవహారంపై ఎవరీ అభిప్రాయాలను వారు మీడియా ముఖంగా తెలియజేశారు. అయితే లడ్డూ వివాదంలో తమిళ నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యలు వారం రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్ ఓ మీమ్ చూపగా హీరో కార్తీ ఇప్పుడు లడ్డూ టాపిక్ వద్దు.. చాలా సెన్సిటివ్ అన్నారు. అయితే ఈ కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్ (Pawan Interview) లడ్డూ పై కామెంట్స్ చేస్తే మర్యాదగా ఉండదని, సినిమా వాళ్లంటే గౌరవమే కానీ సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదని కార్తీని హెచ్చరించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న కార్తీ సారీ పవన్ కల్యాణ్ గారు.. నేను ఆ మాటలు అన్నది వేరే ఉద్దేశంతో అన్నాను. నా మాటల పట్ల మీరు ఇబ్బంది పడినందుకు సారీ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా కార్తీ సోదరుడు సూర్య సైతం నా తమ్ముడు కార్తీ వ్యాఖ్యల పట్ల నేను కూడా సారీ అడుగుతున్నా. అంతేకాకుండా3 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటాను అని ట్వీట్ చేశారు. అయితే తన తప్పు తెలుసుకున్న పవన్ వెంటనే స్పందించి హీరో కార్తీ, సూర్య స్పందించిన తీరుకు ధన్యవాదాలు. మీరు కావాలని అనలేదని నాకు అర్థమవుతోంది. మీ సత్యం సుందరం మూవీ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని సారీ చెప్పకుండా చెప్పినట్లే ట్వీట్ పెట్టారు. దీంతో ఆ వివాదం అక్కడితో క్లోజ్ అయింది.
Also Read: Thaman : రామ్ చరణ్ ఫ్యాన్ రిక్వెస్ట్.. అడ్రెస్ పెట్టు కొని పంపిస్తా తమన్ ట్వీట్..
ఈ సమయంలోనే ఒక తమిళ యూట్యూబ్ చానెల్ పవన్ కల్యాణ్‌తో సుమారు రెండు గంటలపాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తమిళ్ మాట్లాడటంతో యాంకర్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ సనాతన ధర్మం గురించి కూడా తమిళంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తమిళంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడిన తీరు, సనాతన ధర్మం పట్ల మాటలను తమిళ ప్రజలు ప్రశంసిస్తున్నారు. అయితే కార్తీని క్షమాపణ చెప్పించడంతో కొందరు తమిళ అభిమానులు పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వైరల్ కావడంతో వారు కాకుండా పవన్ ను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో పవన్ ఒక ఇంటర్వ్యూతో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అయింది.