Site icon HashtagU Telugu

Pawan Kalyan : ప్రజల కోసం టెంట్ కిందే కూర్చొని సమస్యలు విన్న జనసేనాని..

Pawan Mgr

Pawan Mgr

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డ్యూటీ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుందా..? అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి..ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే అంత అందరి రాజకీయ నేతలాగే పవన్ కళ్యాణ్ ఉంటాడని కొంతమంది అనుకున్నారు..కానీ అందరు వేరు..పవన్ కళ్యాణ్ వేరు అని మంత్రిగా బాధ్యత తీసుకోగానే అర్థమైంది. కష్టం వచ్చిందని వస్తే ఆఫీస్ ముందే వాళ్ళ ఎదురుగానే సమస్య తీరేలా చూస్తాడని ఈరోజు తెలిసింది.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండు రోజులు అసెంబ్లీకి టైం కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..ఈరోజు సమావేశాలు పూర్తికాగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడ జనసేన పాక్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి వివిధ ప్రాంతాల నుంచి తమ కష్టాలు చెప్పుకునేందుకు కార్యాలయం బయట నిరీక్షిస్తున్నారు. వారిని చూసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికక్కడే కాన్వాయ్ ఆపేసి ఆఫీసు ముందున్న పూరి పాకలో కుర్చీలు వేసుకొని బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం , కొన్నింటికి అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించే ఏర్పాట్లు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే భీమవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను.. ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని వాపోయింది. మైనర్ అయిన తన కూతురు గడిచిన తొమ్మిది నెలలుగా కనిపించడం లేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కూతురు కనిపించకుండా పోయిన విషయమై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని.. పోలీసులకు తమ కూతురు జాడ తెలిసినా కూడా పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్‌ వద్ద మొరపెట్టుకుంది. మహిళ బాధను పూర్తిగా విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మిస్సింగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించారు. ఆ వెంటనే మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసు మీద చర్యలకు పవన్ ఆదేశించారు. అనంతరం పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులైతే డిప్యూటీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read Also : Sunita Williams : అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్.. భూమికి తిరిగి వచ్చేదెప్పుడు ?