టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు (Chandrababu) మాట ఇచ్చాడంటే…దేవుడు తథాస్తు అన్నట్లే అని మరో సారి రుజువైంది. తాజాగా సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా(Palnadu district)లో పర్యటించిన సంగతి తెలిసిందే. నరసరావుపేట మండలం యల్లమందలో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. చంద్రబాబు ఉల్లంగుల ఏడుకొండలు (Ullengula Yedukondalu ) ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు.. తనకు పింఛన్ డబ్బులు వస్తాయని.. అలాగే తాను పంక్చర్ షాపును నడుపుతున్నట్లు ఏడుకొండలు చెప్పుకొచ్చారు. ఇలా షాపులో ఎయిర్ కంప్రెసర్ (air compressor) నడుపుతూ వచ్చిన డబ్బులతో పాటు ప్రతి నెలా తనకు వచ్చే పింఛనుతో కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపాడు.
Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
అయితే తాను నడిపే పంక్చర్ షాపులో ఎయిర్ కంప్రెసర్ పాతదైందని.. తనకు కొత్తది అందిస్తే బావుంటుందని తన మనసులోని కోరికను చంద్రబాబు ముందు పెట్టాడు. తన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని, పనులకు వెళ్లలేకపోతున్నానని.. ఎలక్ట్రికల్ షాపు ఏర్పాటుకు సాయం చేయాలని కోరారు. దీనికి సీఎం చంద్రబాబు వెంటనే బీసీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల చెక్కును ఆ రోజే అందజేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కలెక్టర్ అరుణ్‌బాబు, ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావులు యల్లమంద గ్రామానికి వెళ్లి , నూతన సంవత్సరం రోజే ఏడుకొండలు ఇంటికి వెళ్లి ఎయిర్ కంప్రెసర్ అందజేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కేవలం 24 గంటల్లోనే కొత్త ఎయిర్ కంప్రెసర్ అందించినందుకు చంద్రబాబుకు ఏడుకొండలు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం చుట్టుపక్కల వారికే కాదు రాష్ట్రం మొత్తానికి తెలియడం తో చంద్రన్న మాట ఇచ్చాడంటే అంతే మరి అని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
BC Mahasabha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అటకెక్కాయి: ఎమ్మెల్సీ కవిత