Site icon HashtagU Telugu

Palla Srinivasa Rao: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్ టీడీపీ కొత్త బాస్ పల్లా శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు ఇతర పార్టీల నాయకులు పల్లా శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పల్లా శ్రీనివాస్‌ ఇదివరకు విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. అయితే అచ్చన్నాయుడు మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ అధ్యక్షుడి బాధ్యతను పల్లా శ్రీనివాస్‌ కు అప్పగించారు సీఎం చంద్రబాబు జూన్. పల్లా శ్రీనివాస్‌ గాజువాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. పల్లా శ్రీనివాస్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పలువురు సీనియర్‌ నాయకులు కొనియాడారు, రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొత్త పాత్రతో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి సరికొత్త శక్తిని, దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు.

Also Read: MS Dhoni New Hairstyle: ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న ఎంఎస్ ధోనీ న్యూ లుక్‌.. హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్‌..!