Anam Ramaranayana Reddy : భారత్‌తో యుద్ధం చేసే శక్తి పాకిస్థాన్‌కు లేదని, ఉగ్రవాదాన్ని ఆధారంగా చేసుకొని దాడులకు దిగితే భారత సైన్యం గట్టి సమాధానం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి మహిళల జీవితాలనే లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో భారత మహిళలు సైతం ధీటుగా ఎదురుదెబ్బ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. సింధూరాన్ని తుడిచేందుకు ప్రయత్నించినప్పుడు, మహిళలే ముందుండి భారతీయ సైన్యానికి మద్దతుగా నిలిచారని ఆయన తెలిపారు.
పాక్ మళ్లీ పంచదార పలుకుతున్నా, వెనుకుంజాలే దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇటువంటి క్షణాల్లో భారతీయులు ఐక్యంగా నిలవాలని, ఉగ్రవాదాన్ని సమూలంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌తో జరిగిన ఎదురుదెబ్బల్లో ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ మురళినాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన మురళినాయక్ త్యాగం దేశం ఎప్పటికీ మరిచిపోలేదన్నారు.
Read Also: CPI Narayana : పీఓకే స్వాధీనం చేసుకోకుండానే చర్చలా?: బీజేపీకి నారాయణ ప్రశ్న