Tanuk : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం తణుకు కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
Read Also: BRS : జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేయండి : స్పీకర్‌కు బీఆర్‌ఎస్ విజ్ఞప్తి
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చా. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే మా ఏకైక లక్ష్యం. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మనకు మిగిల్చి వెళ్లింది. అప్పు తీర్చడంతోపాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోంది. గత సీఎం కనీసం మురికి కాల్వల్లో పూడిక కూడా తీయించలేదు. జగన్ 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లు అన్నారు.
రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాము అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాం. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. పేదల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ4 వేలకు పెంచాం. దివ్యాంగులకు పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాం. చరిత్రలో తొలిసారిగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇక, అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వీరిలో జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తదితరులు ఉన్నారు.
Read Also: Mamnoor Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు