Site icon HashtagU Telugu

CM Chandrababu : ఇది రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వానికి అద్దం పడుతున్న గొప్ప ఘట్టం

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : ఒంగోలు జాతి గిత్తలు తమ అద్భుత లక్షణాలతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించాయి. ప్రకృతి ప్రసాదించిన విలువైన ఆస్తిగా పేరుగాంచిన ఒంగోలు గిత్తలు, తమ మిలమిల మెరుస్తున్న తెల్లటి శరీరం, గంభీరమైన కండరాలు, బలమైన మూపురంతో ఎవరికైనా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన భారీ కాటిల్ వేలంలో విటియాన-19 రకానికి చెందిన ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలికింది. ఇది ఒంగోలు గిత్త ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తంగా మరోసారి చాటింది.

ఒంగోలు జాతి గిత్తలు ఎందుకు అంత ప్రత్యేకం అంటే, వాటికి ఉన్న సహజమైన బలం, జెనెటిక్ శక్తి, , అనువైన ప్రജനన లక్షణాలవల్ల. చలి, వేడి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఈ జాతికి ప్రత్యేకతను ఇస్తుంది. ఒంగోలు గిత్తలు ఎక్కువకాలం జీవించడమే కాదు, అధిక పాల ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి. వీటి జెనెటిక్స్ బలమైనవి కావడంతో, వీటి సంతానం కూడా ఆరోగ్యవంతమైనదిగా, బలమైనదిగా పెరుగుతుంది.

 Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం ఈ గిత్తల పుట్టినిల్లు. ప్రాచీన కాలం నుంచే ఈ గిత్తలు తమ ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. రాజులు, బ్రిటిష్ అధికారులు, విదేశీయులు కూడా ఒంగోలు జాతి గొప్పతనాన్ని ప్రశంసించారు. వీటిని ముఖ్యంగా సాగు పనులకూ, అంతర్జాతీయ క్రీడలకూ ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒంగోలు జాతిని పెంచుతుండటం మన పశుసంవర్ధక వారసత్వానికి గర్వకారణం.

బ్రెజిల్‌లోని కాటిల్ వేలంలో ఒంగోలు గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం ఆ జాతికి ఉన్న గ్లోబల్ డిమాండ్‌ను చాటింది. ఇది కేవలం గిత్త కాదు, భారతదేశ పశుసంవర్ధక రంగ ప్రతిష్టను ప్రతిబింబించే సంపద. ఇలాంటి ఒంగోలు గిత్తలు మెక్సికో, బ్రెజిల్, అమెరికా, ఆఫ్రికా వంటి దేశాల్లో విస్తృతంగా పెంచబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “ఒంగోలు గిత్త మరోసారి ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను పెంచింది. ఇది పశుసంవర్ధక వారసత్వానికి గొప్ప అద్దం,” అని సీఎం అన్నారు. అలాగే, ఒంగోలు గిత్తల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఒంగోలు గిత్తలను రక్షించడంలో ప్రభుత్వ చర్యలు, పరిశోధనల ప్రాధాన్యత పెరుగుతోంది. వీటి జనాభా తగ్గడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, పాడి రైతులకు ఆర్థిక సహాయం, జాతి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వీటి వృద్ధికి ప్రోత్సాహం ఇస్తున్నారు.

 Water Supply: హైద‌రాబాద్ వాసుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. నీటి సరఫరాలో అంతరాయం