Jagan Marks Justice: వైసీపీలో అందరికీ ఓకే రూల్స్ ఉండవు. సామాజిక వర్గాన్ని అనుసరించి వివిధ రూల్స్ ఉంటాయని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Marks Justice) సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్‌ఎల్‌ఏ, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ జైలు పాలయ్యారు. ఆయనని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.. వంశీని విజయవాడ జైలుకి వెళ్లి పరామర్శించారు జగన్.
ఇక, ఈవీఎమ్‌ని బద్దలు కొట్టిన కేసులో ఇరుక్కున్న మాచర్ల మాజీ ఎమ్‌ఎల్‌ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నెల్లూరు జైలుకి వెళ్లి మరీ పరామర్శించారు జగన్.. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి టీడీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్లు కూడా భారీగా వచ్చాయి కూటమి నేతల నుండి.. ఈ అంశం పక్కన పెడితే, జగన్.. ఇటు వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరామర్శించిన జగన్.. అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ సుమారు రెండున్నర నెలలు జైలులో శిక్ష అనుభవించాడు.. అయినా, ఏ ఒక్క రోజు కూడా జగన్.. జైలుకి వెళ్లి పరామర్శించలేదు.. ఆయనకు దూరంగానే ఉన్నాడు.. రెండున్నర నెలలలో ఒక్క పావు గంట సమయం కూడా జగన్‌కి లభించలేదా.? నందిగం సురేష్ ఏం తప్పు చేశాడని నిలదీస్తున్నారు వైసీపీలోని దళిత నేతలు కొందరు!
Also Read: Free Bus To Women: ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
వల్లభనేని వంశీది కమ్మ సామాజిక వర్గం.. ఇటు, పిన్నెల్లిది జగన్‌కి చెందిన రెడ్డి సామాజిక వర్గం. ఈ ఇద్దరు అగ్ర కులాలకు చెందిన నేతలు కావడంతో వైసీపీ అధినేత పరామర్శించాడని, నందిగం సురేశ్ నిమ్న కులాలకు చెందిన నేత కావడంతోనే కనీసం జైలు వైపు చూడలేదని విమర్శిస్తున్నారు దళిత నేతలు.. తక్కువ కులంలో జన్మించడమే నందిగం సురేశ్ చేసిన పాపమా..? అని నిలదీస్తున్నారు.. వల్లభనేని వంశీ, పిన్నెల్లి కంటే జగన్ వెంట ఎక్కువగా కనిపించేది సురేష్ అని గుర్తు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు.. జగన్ గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన సమయంలోనూ నందిగం సురేష్‌ని ఆయన సెక్యూరిటీ సిబ్బంది విసిరి నెడుతున్న దృశ్యాలు చర్చకు దారితీశాయి..
జగన్ కోసం గతంలోనూ నందిగం సురేశ్ జైలుకి వెళ్లాడు. అయినా, వైసీపీ అధినేత నందిగంని లైట్ తీసుకున్నాడనే చర్చ మొదలయింది.. ఇవేవీ జగన్‌కి గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు దళిత నేతలు.. మరి, జగన్ టీమ్ వీటికి ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి..