తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని (TDP 43rd Fundation Day) పురస్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh), రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఒక మహనీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. ఎన్టీఆర్ (NTR) లాంటి గొప్ప నాయకుడు మళ్లీ పుట్టలేరని, అలాంటి మహానుభావుడికి వారసులమంతా కేవలం పార్టీ సేవకులమేనని, పెత్తందారులు కాదని స్పష్టం చేశారు.
Nara Lokesh: టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ కీలక హామీ.. ప్రమోషన్ ఇస్తా అంటూ వ్యాఖ్యలు!
తెలుగుదేశం పార్టీ విజయంలో కార్యకర్తల పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించారు. 43 ఏళ్లుగా పార్టీని ప్రజల గుండెల్లో నిలిపిన వారంతా వారి త్యాగం, కష్టపడే ధోరణి, పార్టీపై ఉన్న విశ్వాసమే ఈ విజయానికి మూల కారణమని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన 9 నెలలకే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని, తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన ఎన్టీఆర్ మహాత్ముని ఆశీస్సులే పార్టీకి బలమని తెలిపారు. విపక్షాలు టీడీపీని లేని చేసేందుకు ఎంత ప్రయత్నించినా కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని చంద్రబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేష్, ఇతర ముఖ్య నాయకులు పుష్పాంజలి అర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, భవిష్యత్తులోనూ అదే విధంగా ప్రజలకు సేవ చేయడానికి పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతుతో మరింత బలంగా ముందుకు సాగుతుందని, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.