Amabti Vs Balakrishna : ‘మా బాబాయినే’ అంత మాట అంటావా..? ఎన్టీఆర్ రియాక్షన్..?

మా బాబాయ్ నే అంత మాట అంటావా..నీకు ఎంత ధైర్యం..బాలకృష్ణ గురించి నీకు అసలు ఏమి తెలుసు..ఆయన ఎంత మంచివారో ..ఎంతమందికి సాయం చేస్తున్నాడో.

Published By: HashtagU Telugu Desk
Amabti Vs Balakrishna

Ntr

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఏపీలోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా కాక రేపుతోంది. ఓ అక్రమ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేసారని పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతున్నారు. టీడీపీ శ్రేణులే కాదు ఐటీ ఉద్యోగులు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియా లోను చంద్రబాబు కు పెద్ద ఎత్తున వ్యాపార దిగ్గజాలు సపోర్ట్ ఇస్తున్నారు.

అయితే చంద్రబాబు అరెస్ట్ ను జూ. ఎన్టీఆర్ (Jr NTR) ఖండించకపోవడంఫై టీడీపీ శ్రేణులే కాదు నందమూరి అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు . సోషల్ మీడియా లో ఏకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ట్వీట్స్ , పోస్టులు కూడా పెట్టారు. ఇదిలా ఉంటె రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ లో బాలకృష్ణ ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తీవ్ర పదజాలం వాడిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ (Balakrishna) మీసం తిప్పడని గందరగోళం సృష్టించాడు. మీసాలు సినిమాల్లో తిప్పితే బాగుంటుందని..ఇక్కడ తిప్పనవసరం లేదని అంబటి రాంబాబు అంటే..మీసం తిప్పితే ఎవరు భయపడరు అంటూ మంత్రి రోజా బాలయ్య ఫై చివాట్లు పెట్టింది. ఇలా బాలయ్య ఫై వైసీపీ నేతలు మాటల యుద్ధమే చేసారు.

ఈ క్రమంలో జూ.ఎన్టీఆర్ (NTR React Balakrishna) బాలకృష్ణ ఫై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యాడని యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మా బాబాయ్ నే అంత మాట అంటావా..నీకు ఎంత ధైర్యం..బాలకృష్ణ గురించి నీకు అసలు ఏమి తెలుసు..ఆయన ఎంత మంచివారో ..ఎంతమందికి సాయం చేస్తున్నాడో..కాన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతమందికి ప్రాణం పోస్తున్నాడో తెలియదా..? బాలకృష్ణ కు తిక్కరేగితే నువ్వు రోడ్ల ఫై తిరగలవా..? అంటూ ఎన్టీఆర్ స్పందించినట్లు కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికైతే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ ఫై కానీ , బాలకృష్ణ ఫై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కానీ రియాక్ట్ అయినట్లు ఎక్కడ అధికారికంగా బయటకు రాలేదు. కానీ కొన్ని వీడియోస్ లలో మాత్రం ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అయ్యాడంటూ వైరల్ చేస్తున్నారు. మరి నిజంగా ఎన్టీఆర్ స్పందించాడా..లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ స్పందిస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు.

Read Also : Balapur Ganesh Laddu @ 27 Lakhs : బాలాపూర్ గణేష్ లడ్డు రూ. 27 లక్షలు పలికితే.. బండ్లగూడలో రూ. 1.20 కోట్లు పలికింది

  Last Updated: 28 Sep 2023, 12:06 PM IST